నేను ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన తరువాత, నా ఇన్వెస్ట్మెంట్ కాలాన్ని మార్చవచ్చా

Video

ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా అనుకూలతను అందిస్తుంది. ఇన్వెస్టర్లు వారు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని, వారు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కాలాన్ని, వారు ఇన్వెస్ట్ చేయాలనుకున్న అంతరం (వారం వారీ, నెలవారీ, త్రైమాసికం వారీ మొదలగునవి) నియంత్రించవచ్చు. 

కానీ మీరు ఎస్ఐపిని ప్రారంభించితే, మీ ఎస్ఐపి కాలం ముగింపు వరకు ప్రారంభ ఎంపికలకు బద్ధులై ఉండాలా? 

జవాబు కాదు. ఉదాహరణకు, మీరు నెలవారీ ఎస్ఐపిని 7 సంవత్సరాల కాలానికి రూ 5,000 ప్రారంభిస్తే, మీ వీలును బట్టి మీరు కాలాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, మీ ఆర్థిక క్షేమాన్ని బట్టి మీ ఎస్ఐపి వాయిదాని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. ఎస్ఐపిలు మీరు విశ్వసించదగ్గ ఉత్తమమైన దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ ఎంపికలలో ఒకటి. ఈ అనుకూల ఫీచర్లు ఇతర ఇన్వెస్ట్మెంట్ ఎంపికలతో పోల్చితే వాటిని ఇబ్బంది లేనివిగా మరియు ఎక్కువ లిక్విడిటీగా చేస్తాయి.

వాస్తవానికి, ఎస్ఐపిలను కాలానుక్రమంగా రెన్యూ చేసి, పొడిగించే ఇబ్బందిని తగ్గించడానికి, మీరు నిరంతంర ఎస్ఐపిని కూడా ఎంపిక చేసుకోవచ్చు మరియు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించే వరకు అవాంతరంలేని విధానంలో కొనసాగించవచ్చు. మీ అవసరమైన సమయాలలో, మీ ఎస్ఐపిని పాజ్ చేయడానికి మీకు అనుకూలత ఉంది. కాలం పూర్తి అవడానికి ముందు మీరు మీ ఎస్ఐపిని ఆపాలని లేదా పాజ్ చేయాలని అనుకుంటే, సురక్షితంగా ఉండటానికి తరువాతి ఎస్ఐపి గడువుకు కనీసం 30 రోజుల ముందు దరఖాస్తుని పంపండి.
 

407

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?