డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫారంలో పెట్టుబడి పెట్టడం ఎంత వరకు సురక్షితం?

Video

ఉచితంగా గానీ లేదా కొంత రుసుముతో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ప్లాట్‌ఫారాలను అందించే పలు ఫిన్‌టెక్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారాలు చాలా వరకు సెబీతో నమోదు చేసుకోబడి, ఈ విధంగా సెబీ వారు ఆదేశించిన సెక్యూరిటీ మరియు గోప్యతా మార్గదర్శకాల ద్వారా చక్కగా-నియంత్రించబడి, పాలించబడతాయి. ఈరోజు ఫార్చూన్ 500 కంపెనీలు కూడా హాక్ చేయబడగలవు, అదే విధంగా మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫారాలు కూడా హాక్ చేయబడగలవు. అయినప్పటికీ, ఇలా జరగడానికి అవకాశం చాలా తక్కువ.

అత్యధిక డైరెక్ట్ ప్లాట్‌ఫారాలను ప్రస్తుతం, ఎక్కువ కాలం మనుగడలో లేని స్టార్ట్‌అప్‌ల యాజమాన్యంలో ఉన్నాయి కాబట్టి, వాటిలో కొన్ని మూసివేయబడే లేదా మరింత పెద్ద సంస్థలచే కొనుగోలు చేయబడే అవకాశం ఉండవచ్చు. అయితే, భవిష్యత్తులో అవి మనుగడలో లేక పోయినప్పటికీ, మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు ఆ మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్తుంది మరియు మీ పెట్టుబడులను నిర్వహించడానికి ఫండ్‌కు సెబీ గుర్తించిన రిజిస్ట్రార్ ఉంటారు కాబట్టి మీరు ఈ రిజిస్టర్ చేయబడిన ప్లాట్‌ఫారాల ద్వారా పెట్టిన మీ పెట్టుబడుల గురించి ఆందోళన చెందకూడదు.

మీ పెట్టుబడులను పొందడానికి మీరు ఫండ్ హౌస్‌ను ఎప్పుడూ  సంప్రదించవచ్చు. యూజర్ అనుభవం, ఫీజు, అది అందించే సర్వీసులు మీకు నచ్చితే మరియు ఫండింగ్ టీమ్ మీ విశ్వాసానికి ప్రేరణ ఇస్తే డైరెక్ట్ ప్లాట్‌ఫారం ఎంచుకోండి. దాని భవిష్యత్తు గురించి మరియు దాని ద్వారా చేయబడిన మీ పెట్టుబడుల గురించి మీరు చింతించకండి. అవి ఎల్లప్పుడూ ఫండ్ హౌస్‌ల వద్ద సురక్షితంగా ఉంటాయి.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?