ముందుగానే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవడం అనేది ఇల్లు కట్టుకోవడం లాంటిది. రిటైర్మెంట్ ప్లానింగ్ విజయవంతం కావాలంటే ఇంటికి బలమైన పునాది ఎంత ముఖ్యమో దృఢమైన ఆర్థిక పునాది కూడా అంతే ముఖ్యం.
ఇంటి నిర్మాణంలో మొదటి దశ బ్లూప్రింట్ రూపొందించడం మరియు అవసరమైన వస్తువులను నిర్ణయించడం. రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలోనూ అంతే. మీరు పదవీ విరమణ చేయాలనుకుంటున్న సమయానికి ఆశించిన రిటైర్మెంట్ కార్పస్ؚను చేరుకోవడానికి ఏ పెట్టుబడి సాధనాలు మీకు సహాయపడతాయో మీరు గుర్తించాలి.
నిర్మాణం పురోగతి చెందుతున్నప్పుడు, క్రమానుగతంగా పురోగతిని అంచనా వేయడం, అవసరమైన సర్దుబాట్లు చేయడం మరియు నిర్మాణం దాని ఉద్దేశిత ప్రయోజనాన్ని చేరుకునేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా, మీరు మీ పోర్ట్‌ఫోలియోను క్రమానుగతంగా సమీక్షించాలి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా అవసరమైతే మీ ప్రణాళికను సర్దుబాటు చేయాలి.
చివరగా, ఇల్లు పూర్తయిన తర్వాత, మీకు సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా నివసించగలిగిన ప్రదేశాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా, పొదుపు మరియు పెట్టుబడులకు ముందస్తు మరియు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అవలంబించడం మీకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన పదవీ విరమణకు దోహదం చేస్తుంది.
మీరు ఇప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించడానికి ఏడు కారణాలు ఇక్కడ ఉన్నాయి
1. పెరుగుతున్న జీవన వ్యయం
భారతదేశంలో జీవన వ్యయం నిరంతరం పెరుగుతోంది, ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. రిటైర్మెంట్ తర్వాత మీ జీవనశైలిని కొనసాగించడానికి మీ వద్ద తగినంత డబ్బు ఉందని నిర్ధారించుకోవడానికి వీలైనంత త్వరగా రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం ప్రారంభించడం చాలా ముఖ్యం.
2. ద్రవ్యోల్బణం మీ పెట్టుబడులను హరించవచ్చు
వస్తుసేవల ధరలు కాలక్రమేణా పెరిగే రేటును ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం గణనీయమైన ఆందోళన కలిగిస్తుంది, మరియు మీరు దాని కోసం ప్లాన్ చేయకపోతే అది కాలక్రమేణా మీ పెట్టుబడులను హరించవచ్చు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడులను పెట్టడంలో చేసిన జాప్యం వలన కలిగే నష్టం గణనీయంగా ఉంటుంది.
3. మీ పోర్ట్‌ఫోలియోను తిరిగి సర్దుబాటు చేయడానికి మరింత ఎక్కువ సమయం ఉంటుంది
మీ రిటైర్మెంట్ ప్రణాళికను ముందుగానే ప్రారంభించడం వల్ల మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేయడానికి మరియు అవసరమైన విధంగా మార్పులు చేయడానికి మీకు ఎక్కువ సమయం లభిస్తుంది. ఇది మీ రిస్క్ నిర్వహణకు మరియు కాలక్రమేణా మీ రాబడిని పెంచడానికి మీకు సహాయపడుతుంది. అనుమానం వచ్చినప్పుడు, మార్గదర్శకత్వం మరియు వివరణ కోసం మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
4. కాంపౌండింగ్ శక్తి
కాంపౌండింగ్ ప్రక్రియ ద్వారా పెట్టుబడిలో వచ్చే ఆదాయాలు తిరిగి పెట్టుబడిగా పెట్టబడతాయి, ఇది కాలక్రమేణా మరింత రాబడిని ఇస్తుంది. మీ రిటైర్మెంట్ ప్రణాళికను ముందుగానే ప్రారంభించడం వల్ల కాంపౌండింగ్ శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి మీకు ఎక్కువ సమయం లభిస్తుంది, ఫలితంగా మీ పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం:
వివరాలు |
25 ఏళ్లకే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి |
30 ఏళ్లకే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి |
35 ఏళ్లకే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి |
పదవీ విరమణ సమయం (మీరు 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారనుకోండి) (ఎ) |
35 |
30 |
25 |
నెలకు పెట్టుబడి పెట్టిన మొత్తం (బి) |
Rs 10 వేలు |
Rs 10 వేలు |
Rs 10 వేలు |
పెట్టుబడిపై ఊహించిన రాబడి* |
10% |
10% |
10% |
ఇన్వెస్ట్ చేసిన మొత్తం |
Rs 42 లక్షలు |
Rs 36 లక్షలు |
Rs 30 లక్షలు |
రాబడులతో కూడబెట్టిన మొత్తం కార్పస్ |
Rs 3.8 కోట్లు |
Rs 2.26 కోట్లు |
Rs 1.34 కోట్లు |
పెట్టుబడులను పెట్టడంలో చేసిన జాప్యం వలన నష్టం |
- |
Rs 1.2 కోట్లు |
Rs 2.5 కోట్లు |
* పై లెక్కలు దృష్టాంత ప్రయోజనాల కోసం మాత్రమే. పెట్టుబడి మొత్తాన్ని ఫార్ములాను ఉపయోగించి లెక్కించారు: a*b*12. రాబడులతో కూడబెట్టిన మొత్తం కార్పస్ؚను సిప్ కాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కించారు. 25 సంవత్సరాల వయస్సు నుండి నిర్మించిన మొత్తం కార్పస్ నుండి ఒక నిర్దిష్ట వయస్సులో పేరుకుపోయిన మొత్తం కార్పస్ؚను తీసివేయడం ద్వారా పెట్టుబడిని ఆలస్యం కావడం వల్ల అయ్యే ఖర్చును నిర్ణయించారు.
5. రాబడి పొందే అవకాశం
ముందుగానే పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో రాబడి పొందే సామర్ధ్యం కలిగిన పెట్టుబడులను కనుగొనే అవకాశాలను పెంచుతుంది. వివిధ ఎంపికలను పరిశోధించడానికి మరియు విశ్లేషించడానికి మీకు ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా, మీరు మీ రిటైర్మెంట్ పొదుపు పెరుగుదలను వేగవంతం చేయవచ్చు మరియు పదవీ విరమణలో మీ ఆర్థిక అవసరాలకు బాగా సిద్ధం కావచ్చు.
6. ముందస్తు ప్రణాళికతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు
మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం మరియు పొదుపు చేయడం సులభం అవుతుంది, ఇది తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.
7. మీ స్వంత షరతులతో పదవీ విరమణ చేయండి
మీ రిటైర్మెంట్ ప్రణాళికను ముందుగానే ప్రారంభించడం వల్ల మీరు ఎప్పుడు, ఎలా రిటైర్ అవుతారనే దానిపై మీకు మరింత నియంత్రణ లభిస్తుంది. అంతేకాక, చిన్న వయస్సులో, మీకు తక్కువ బాధ్యతలు మరియు లక్ష్యాలు ఉండవచ్చు, తద్వారా రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టడం మరింత సాధ్యమవుతుంది. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ కాలం తప్పనిసరిగా పని చేయడానికి బదులుగా మీరు కోరుకున్నప్పుడు మరియు మీ స్వంత నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసే సౌలభ్యాన్ని ఇది అందిస్తుంది.
చివరి మాట
మీరు మీ బంగారు సంవత్సరాలలోకి ప్రవేశించినప్పుడు మీ భద్రతను నిర్ధారించడానికి మీ రిటైర్మెంట్ ప్రణాళిక చాలా అవసరం. వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలి. కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు పరిష్కార ఆధారిత రిటైర్మెంట్ ప్లాన్ల వర్గంలోకి వస్తాయి, ఇవి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. అయితే, ఇతర రకాల మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి రిటైర్మెంట్ కోసం కేటాయించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీకు ఏవైనా ఆందోళనలు లేదా ప్రశ్నలు ఉన్నట్లయితే, మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి గైడెన్స్ పొందడం మంచిది.
అయితే, అధిక పెట్టుబడి ప్రీమియం చెల్లించే ప్రమాదం ఉన్నందున రిటైర్మెంట్ ప్రణాళికను ఆలస్యం చేయకపోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి లేని మరియు విశ్రాంతితో కూడిన పదవీ విరమణకు మీకు మీరు ఉత్తమ అవకాశాన్ని ఇవ్వడానికి ముందుగానే ప్రారంభించండి.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.