మనం అందరం విని ఉన్నాము: “మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.” ఈ రిస్కులు ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా?
ఎడమ వైపున ఉన్న చిత్రం విభిన్న రకాల రిస్కుల గురించి మాట్లాడుతుంది.
అన్ని ఫండ్ స్కీములని అన్ని రిస్కులు ప్రభావితం చేయవు. స్కీము సమాచార దస్తావేజు(ఎస్ఐడి) మీరు ఎన్నుకున్న స్కీముకి ఏ రిస్కులు వర్తిస్తాయో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
అయితే ఈ రిస్కులను ఫండ్ మేనేజిమెంట్ టీమ్ ఎలా నిర్వహిస్తుంది?
ఇదంతా మీరు ఏ రకం మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ట సెక్యూరిటీలు నిర్దిష్ట రిస్కులకు మరింత సున్నితంగా ఉంటాయి మరియు కొన్ని ఇంకొక రకమైన వాటికి లోనవుతాయి.
ప్రొఫెషనల్ సహాయం, విస్తరణ మరియు ఎస్ఇబిఐ నియంత్రణలు మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్కులను తగ్గించడానికి సహాయపడతాయి.
చివరగా, ఎంతో మంది ఇన్వెస్టర్లు అడిగిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న: మ్యూచువల్ ఫండ్ కంపెనీ నా డబ్బుతో పారిపోగలదా? మ్యూచువల్ ఫండ్స్ నిర్మాణం బలమైన నియంత్రణలతొ ఇవ్వబడినది కాబట్టి ఇది అస్సలు సాధ్యం కాదు.