మ్యూచువల్ ఫండ్ స్కీము లోని పెట్టుబడులను ఒక స్కీము నుండి ఇంకొక దానికి మార్చవచ్చా?

మ్యూచువల్ ఫండ్ స్కీము లోని పెట్టుబడులను ఒక స్కీము నుండి ఇంకొక దానికి మార్చవచ్చా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీములో ఇన్వెస్ట్ చేసిన తరువాత, ప్లాన్ల పరంగా (రెగ్యులర్/డైరెక్ట్), ఆప్షన్స్ (గ్రోత్/డివిడెండ్) లేదా ఒకే ఫండ్ హౌసు లోపల స్కీములు మార్చాలనుకున్నది ఏదైనా ఒక సేల్ (రిడెంషన్) గా పరిగణించబడుతుంది. కావున ఏదైనా మార్పు చేయడం సాధ్యమే కానీ రిడెంషన్ లాగా, ఈ మార్పులకు మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారన్న దానిని బట్టి ఎగ్జిట్ లోడ్ మరియు క్యాపిటల్ గెయిన్ టాక్స్ విధించబడతాయి. స్కీముల మధ్య స్విచింగ్ మరియు రిడెంషన్ రిక్వెస్ట్ చేయడంలో ఏకైక తేడా ముందు దాని విషయంలో, డబ్బు నేరుగా ఇన్వెస్ట్ చేయబడుతుంది కాగా తరువాతి దానిలో డబ్బు మీ అకౌంటుకి క్రెడిట్ చేయబడుతుంది మరియు రిడెంషన్ ప్రొసీడ్లని మీరు తరువాత విభిన్న స్కీములో ఇన్వెస్ట్ కొరకు ఎంపిక చేసుకోవచ్చు.

మీరు ఒక ఈక్విటీ ఓరియెంటెడ్ స్కీములో (ఇఒఎస్) ఇన్వెస్ట్ చేసి మరియు ఒక సంవత్సరం పూర్తి చేయడానికి ముందు మీరు మీ ఇన్వెస్ట్మెంట్లను స్విచ్ చేస్తే, వర్తించే ఏదైనా ఏగ్జిట్ లోడ్ (ఏదైనా ఉంటే) మరియు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 15% విధించబడుతుంది. మీరు ఒక సంవత్సరం కన్నా మించి పూర్తి చేస్తే, నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ 1 లక్ష మించిన గెయిన్స్ పైన 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విధించబడుతుంది.

 

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను