అవును! చిన్న పొదుపులతో లేదా చిన్న ప్రారంభాలు ఉన్న ఒక ఇన్వెస్టర్‌కైనా, మ్యూచువల్ ఫండ్స్ ఒక ఆదర్శ పెట్టుబడి వాహనంగా ఉంటాయి.
సేవింగ్స్ బ్యాంక్( SB) ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్ స్కీం లలో దాదాపుగా పెట్టుబడి చేయడం ఆరంభించవచ్చు. ప్రతి నెలా తక్కువలో తక్కువ 500 రూపాయలతో* క్రమ వారీ పెట్టుబడి చేసే అలవాటును మ్యూచువల్ ఫండ్స్ ప్రోత్సహిస్తున్నాయి
చిన్న పెట్టుబడిదారునికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇతర ప్రయోజనాలు-
- సులువుగా లావాదేవీ జరపడం: పెట్టుబడి పెట్టడం, సమీక్షించడం, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము నిర్వహించడం మరియు వాటి నుండి రిడీమ్ చేయడం అన్నీ సులువైన ప్రక్రియలు.
- పూర్తి పారదర్శకతను పొందండి: గరిష్ట పారదర్శకత, స్పష్టమైన డిస్క్లోజర్లు మరియు ఖాతాల సమయానుకూల స్టేట్మెంట్లు వంటి వాటిని చిన్న లేదా మొదటిసారి పెట్టుబడి చేసే మదుపుదారులు కోరుకుంటారు.
- ప్రొఫెషనల్ గా నిర్వహించబడినవి: ఫండ్ నిర్వాహకుల ద్వారా ప్రొఫెషనల్ గా నిర్వహించబడే వైవిద్యపు పోర్టుఫోలియోలను మీరు నిర్మించవచ్చు. వారు సుదీర్ఘ పరిశోధనతో తమ నిర్ణయాలను తీసుకుంటారు.
- మదుపుదారులు అందరూ ఒకటే: 500 రూపాయలు పెట్టుబడి చేసిన మదుపుదారుడు లేదా ఐదు కోట్ల రూపాయలు పొదుపు చేసిన మదుపుదారుడు వీరిరువురికి ఒకే రకపు పెట్టుబడి పర్ఫామెన్స్ ను మ్యూచువల్ ఫండ్ అందిస్తుంది. అందుకే