సంపద సృష్టించడానికి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ భావన ‘ముందుగా ప్రారంభించండి’. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘ కాలానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి’. ఇన్వెస్ట్‌మెంట్ రూ 500 అంత తక్కువ అయినా, ఇది ప్రయాణం ప్రారంభాన్ని గుర్తిస్తుంది కావున ముఖ్యమైనది.
మీరు ముందుకు సాగే కొద్దీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాలను పెంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ స్కీములో, మీరు అదే ఫండ్/అకౌంటులో అదనపు కొనుగోళ్ళు ఎల్లప్పుడూ చేయవచ్చు. చాలా ఫండ్ హౌసులలో, ఇది రూ 100 అంత తక్కువ మొత్తాలకు ఉండవచ్చు లేదా డబ్బు బదిలీ చేయవచ్చు లేదా ఇతర స్కీముల నుండి మారవచ్చు. మీరు రు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ని ప్రారంభించవచ్చు, బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ లాగా ఇది స్కీములో రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్‌కి, వీలు కల్పిస్తుంది. ఇంకా చాలా ఎఎమ్‌సిలు వారి ఇన్వెస్టర్లు ప్రతి సంవత్సరం క్రమంగా వారి ఎస్ఐపిని పెంచడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా వార్షిక ఆదాయం అకౌంటుకి పెరగగలదు.
మ్యుచువల్ ఫండ్స్, వాటి అనుకూలత మరియు సౌకర్యంతో నేటి బిజీ ప్రపంచంలో ఆదర్శ ఇన్వెస్ట్మెంట్ వాహనాలుగా ఉన్నాయి.