చాలా మందికి తమ రిటైర్డ్ జీవితం, ఉద్యోగ జీవితం అంత ఉంటుందని, వారికి కనీసం 25-30 సంవత్సరాలకు సరిపడా ఒక పెద్ద కార్పస్ అవసరమవుతుందని తెలియదు. సరియైన ఆర్థిక ప్రణాళిక లేకుండా, అన్ని ఖర్చులు మరియు అత్యవసర అవసరాలు తీర్చడానికి మీ సేవింగ్స్ సరిపోకపోవచ్చు. అయితే 25-30 సంవత్సరాల రిటైర్డ్ జీవితం కొనసాగించడానికి కార్పస్‌ని ఎలా రూపొందించాలి? మొదట, మా ద్రవ్యోల్బణం క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ వార్షిక ఖర్చులు ఎలా ఉండబోతున్నాయో లెక్కించండి, 20-30 సంవత్సరాల మీ రిటైర్డ్ జీవితం కొనసాగించడానికి మీకు అవసరమయ్యే మొత్తం నిధిని నిర్ణయించండి. మీకు రిటైర్డ్‌మెంట్ నిధి ఎంత కావాలో తెలిసిన తర్వాత, అంత మొత్తం నిధిని మీరు ఉద్యోగం చేసే సంవత్సరాలలో రూపొందించడానికి మీరు ఇప్పుడు ప్రారంభించడం అవసరమైన నెలవారీ SIP పెట్టుబడులను లెక్కించడానికి మీరు మా గోల్ SIP క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడంలో ఉన్న ప్రయోజనం ఏమిటంటే, అది మీ జేబుకు ఇబ్బంది కలిగించదు మరియు మీ నెలసరి ఆదాయం నుండి మేనేజ్ చేయవచ్చు.
తర్వాత, మీ రిస్క్ చేసే సామర్ధ్యంపై ఆధారపడి దీర్ఘ-కాలిక ఎదుగుదల కోసం కొన్ని మ్యుచువల్ ఫండ్ స్కీములను
మరింత చదవండి