ఇతర పెట్టుబడుల మాదిరిగానే, ఒక ETFను ఎంచుకోవడం అనేది మీకు కావలసిన అసెట్ కేటాయింపు, ఆర్ధిక లక్ష్యం, రిస్క్ ప్రాధాన్యత, టైం హారిజాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ETFను ఎంచుకోవడం అనేది దానికి ETFను జత చేయడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోలో మీరు ఈక్విటీలు, బాండ్లు, రియల్ ఎస్టేట్, కమోడిటీలు వంటి అసెట్ క్లాసుల వివిధ రకాల కొరకు ETFలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, సాధించాలనుకుంటున్న అసెట్ కేటాయింపు రకం ఏది అనేదాని మీద ఒక ETFను ఎంచుకోవడం ఆధారపడి ఉంటుంది. ETF కొరకు అసెట్ క్లాసును ముందుగా నిశ్చయించుకోండి.
మీరు సాధించాలనుకుంటున్న వైవిధ్యీకరణ రకం మరియు మీరు ట్రాక్ చేయాలనుకుంటున్న సూచీని నిశ్చయించుకోండి. తక్కువ రిస్కుతో గరిష్ట వైవిధ్యీకరణను సాధించేందుకు ఒక విస్తార మార్కెట్ సూచీని ట్రాక్ చేసే ETF అనువైనది. రిస్కు తీసుకునేందుకు మీరు సుముఖంగా ఉండి, నిషే మార్కెట్ సెగ్మెంటు, సెక్టార్లు లేదా దేశాలకు ఎక్స్పోజర్ కావాలనుకుంటే, ఒక నిర్దిష్ట ETFను ఎంచుకోండి.
మీకు అందించగల ఎక్స్‌పోజర్‌ను అర్ధం చేసుకునేందుకు ETF పోర్ట్‌ఫోలియోను చూడండి. మీరు అనుసరించాలనుకుంటున్న అసెట్ క్లాస్, మార్కెట్ సెగ్మెంట్ పరిధిలో తక్కువ ట్రాకింగ్ లోపం ఉన్న ETFలను ఎంచుకోండి. తక్కువగా ట్రేడ్ అయ్యే ETFల జోలికి వెళ్ళకండి, ఎందుకంటే అవి వైడర్ బిడ్/ఆస్క్ స్ప్రెడ్స్ మరియు మీ ట్రేడింగ్ ఖర్చులను పెంచి, తద్వారా మీ ETF నుండి రాబడులను తగ్గిస్తాయి. సంకుచిత మార్కెట్ సెగ్మెంట్లను ట్రాక్ చేసే లేదా తక్కువ స్థాయి అసెట్లను కలిగిన ETFలు తక్కువ లిక్విడ్‌గా ఉంటూ, వాటి క్రింద వచ్చే NAV తో అనుగుణంగా లేని ధర వద్ద ట్రేడ్ చేస్తాయి. వాటి NAV లకు దగ్గరగా ట్రేడ్ చేసేట్టుగా ఉండే ETFల కొరకు చూడండి.