మ్యూచువల్ ఫండ్లను సాధారణంగా దీర్ఘకాలిక సంపదను సృష్టించే సాధనాలుగా చూస్తారు, కానీ స్వల్పకాలిక లక్ష్యాలకు కూడా సరిపోయే అనేక రకాల మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్లు సాపేక్షంగా స్వల్ప కాలపరిమితితో ఆర్థిక లక్ష్యాలను తీర్చడానికి రూపొందించిన పెట్టుబడి సాధనాలు.
ఫ్లెక్సిబిలిటీ, లిక్విడిటీతో కూడిన మ్యూచువల్ ఫండ్లు స్వల్పకాలిక లక్ష్యాల కోసం అందుబాటులో ఉన్న పరిమిత సమయంలో రిస్క్ؚ ను తగ్గించుకుంటూ మూలధన వృద్ధిని అందించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా, సంభావ్య రాబడులు మరియు అంతర్లీన రిస్క్ మధ్య సమతుల్యతను అందించడానికి ఈ ఫండ్లు రూపొందించబడ్డాయి.
ఈ నిధులు అనుకోని ఖర్చుల కోసం అత్యవసర నిధిని సృష్టించడం, ప్రణాళికాబద్ధమైన విహారయాత్రలు లేదా సెలవుల కోసం పొదుపు చేయడం, ఇంటిపై డౌన్ؚపేమెంట్ కోసం నిధులను సేకరించడం, వాహన కొనుగోలుకు నిధులు సమకూర్చడం, విద్యా ఖర్చుల కోసం డబ్బును కేటాయించడం, వివాహ ఖర్చుల మరియు స్వల్పకాలిక గృహ పునరుద్ధరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం వంటి ఇతర లక్ష్యాలకు బాగా సరిపోతాయి.
స్వల్పకాలిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్లను ఎంచుకునే పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్, డైవర్సిఫైడ్ పోర్ట్ؚఫోలియోలు మరియు అవసరమైనప్పుడు వారి నిధులను సులభంగా యాక్సెస్ చేయగల సామర్థ్యం నుండి ప్రయోజనం పొందవచ్చు.
అనేక రకాల మ్యూచువల్ ఫండ్లు స్వల్పకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి, ప్రతి ఒకటి తమ సొంత లక్షణాలు మరియు రిస్క్ ప్రొఫైల్‌లు కలిగి ఉంటాయి. స్వల్పకాలిక మ్యూచువల్ ఫండ్స్ యొక్క కొన్ని ముఖ్యమైన వర్గాలు:
లిక్విడ్: లిక్విడ్ లేదా ఈ రకమైన మ్యూచువల్ ఫండ్లు స్వల్పకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు మనీ మార్కెట్ సాధనాలు వంటి అధిక ద్రవ్యతను కలిగి ఉండే సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెడతాయి. అధిక స్థాయి భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్వహిస్తూ పెట్టుబడిదారులకు వారి నిధులకు త్వరిత మరియు సులభమైన ప్రాప్యతను అందించడం దీని ప్రాధమిక లక్ష్యం.
మనీ మార్కెట్ ఫండ్లు: మనీ మార్కెట్ ఫండ్లు అనేవి మ్యూచువల్ ఫండ్లలో ఒక వర్గం, ఇవి ప్రధానంగా ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ సర్టిఫికేట్లు మరియు వాణిజ్య పత్రాలు వంటి స్వల్పకాలిక, తక్కువ-రిస్క్ మరియు సులభంగా మార్చగలిగే సెక్యూరిటీలకు పెట్టుబడులను కేటాయిస్తాయి.
స్వల్పకాలిక ఋణ నిధులు: స్వల్పకాలిక ఋణ నిధులు అనేవి మ్యూచువల్ ఫండ్లు, ఇవి ఎక్కువగా స్వల్ప మెచ్యూరిటీ ఉన్న స్థిర-ఆదాయ సెక్యూరిటీలకు పెట్టుబడులను కేటాయిస్తాయి. వడ్డీరేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావాలను తగ్గించి ప్రధానంగా వడ్డీ ఆదాయం ద్వారా రాబడులను ఆర్జించడం వీటి లక్ష్యం.
స్వల్పకాలిక బాండ్ ఫండ్లు: స్వల్పకాలిక బాండ్ ఫండ్లు అనేవి మ్యూచువల్ ఫండ్లు, ఇవి ప్రధానంగా షార్ట్ టర్మ్ బాండ్ల డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్లు తక్కువ రిస్క్ ప్రొఫైల్‌ను నిర్వహిస్తూనే మనీ మార్కెట్ ఫండ్ల కంటే సాపేక్షంగా అధిక రాబడిని అందించాలనే లక్ష్యంతో ఉంటాయి.
గిల్ట్ ఫండ్లు: గిల్ట్ ఫండ్లు అనేది ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా గిల్ట్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ల రకాలు. ఈ ఫండ్లు సాపేక్షంగా తక్కువ-రిస్క్ పెట్టుబడి ఎంపికను అందిస్తాయి, ఎందుకంటే ప్రభుత్వ మద్దతు కలిగిన సెక్యూరిటీలు సాధారణంగా అధిక క్రెడిట్ రేటింగ్‌ను కలిగి ఉంటాయి.
ఏదేమైనా, స్వల్పకాలిక మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు, పెట్టుబడిదారులు వారి రిస్క్ టాలరెన్స్, పెట్టుబడి పరిధి మరియు ఆర్థిక లక్ష్యాలను సరిగ్గా అంచనా వేయడం చాలా ముఖ్యం. అదనంగా, ఆర్థిక సలహాదారు నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం వ్యక్తిగత అవసరాలు మరియు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడి వ్యూహాన్ని అనుకూలీకరించడంలో సహాయపడుతుంది.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.