వర్గీకరణ మరియు తద్వారా వాటి మూలమైన పోర్ట్‌ఫోలియోల మీద ఆధారపడి మ్యూచువల్ ఫండ్స్ వివిధ రిస్క్‌లకు గురి కాగలిగి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేక రిస్క్‌లకు గురికాగలవు, అయితే అన్నింటి కంటే ఎక్కువగా ఉండేది మార్కెట్ రిస్క్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ’ఆధిక రిస్క్’ పెట్టుబడి ప్రోడక్ట్‌ల వర్గీకరణ కింద పరిగణిస్తారు. మార్కెట్ రిస్క్‌లకు అన్ని ఈక్విటీ ఫండ్స్ గురైనప్పటికీ, రిస్క్ స్థాయి లు ఫండ్‌కు ఫండ్‌కు మధ్య మారుతూ ఉంటాయి మరియు ఈక్విటీ ఫండ్ రకం మీద ఆధారపడి ఉంటాయి.
లార్జ్‌క్యాప్ కంపెనీ స్టాక్స్‌లో, అంటే బలమైన ఆర్థిక మూలాలు ఉన్న బాగా నిలదొక్కుకున్న కంపెనీలలో పెట్టుబడి పెట్టే లార్జ్ క్యాప్ ఫండ్స్ అతి తక్కువ రిస్క్‌తో కూడుకున్నవిగా భావించబడతాయి, ఎందుకంటే మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్ కంటే ఈ స్టాక్స్ సురక్షితమైనవని భావించడం జరుగుతుంది. తక్కువ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా చక్కటి -వైవిధ్య తను కలిగి ఉంటాయి, అంటే లార్జ్-క్యాప్ కేటగిరీలోని అన్ని రంగాల వ్యాప్తంగా విస్తరించి ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ మరియు ETFలు విస్తృత-ఆధారిత మార్కెట్ సూచీల మీద ఆధారపడి ఉంటాయి, ప్యాసివ్ వ్యూహాన్ని అనుసరించే అవి కూడా తక్కువ రిస్క్ కలవిగా భావించబడతాయి, ఎందుకంటే అవి బాగా డైవర్సిఫై చేయబడిన మార్కెట్ సూచీలను అనుకరిస్తాయి.
రిస్క్ స్పెక్ట్రంలో మరో వైపు ఉండేవి ఫోకస్డ్ ఫండ్స్, సెక్టోరల్ ఫండ్స్ మరియు థెమాటిక్ ఫండ్స్, ఎందుకంటే అవి కేంద్రీకృత పోర్ట్‌ఫోలియోలు కలిగి ఉంటాయి. ఆధిక రిస్క్ ఈక్విటీ ఫండ్స్ సాధారణంగా కాన్సన్ట్రేషన్ నిర్బంధ రిస్కును కలిగి ఉంటాయి ఎందుకంటే వాటి హోల్డింగ్స్ ఒకటి లేదా రెండు రంగాలకు పరిమితమై ఉంటాయి. ఫోకస్డ్ ఫండ్స్ బాగా పేరున్న లార్జ్-క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టినప్పటికీ, అవి సాధారణంగా నిర్బంధ రిస్క్‌ను పెంచే 25-30 స్టాక్స్ మాత్రమే హోల్డ్ చేస్తాయి. ఒక ఫండ్ మేనేజర్ ఊహించింది సరైనదే అయితే, అతను డైవర్సిఫైడ్ లార్జ్-క్యాప్ ఫండ్ కంటే ఎక్కువ రాబడి అందించగలరు, అయితే సరిగ్గా దీనికి వ్యతిరేకంగా కూడా జరిగే అవకాశం ఉంది.
సెక్టోరల్ ఫండ్స్ ఆటో, FMCG లేదా IT లాంటి ఒకే రంగంలోని స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి, కాబట్టి చాలా ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయి, ఎందుకంటే పరిశ్రమను ప్రభావితం చేసే ఏదైనా అవాంఛనీయ సంఘటన పోర్ట్‌ఫోలియో లోని అన్ని స్టాక్స్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. థీమాటిక్ ఫండ్స్ ప్రస్తుతం డిమాండ్ ఉన్న కొన్ని సంబంధిత పరిశ్రమల స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి, కానీ దీర్ఘకాలంలో ఆకర్షణ కోల్పోతాయి.
ఇతర ఫండ్స్ కంటే ఈక్విటీ ఫండ్స్ ఎక్కువ రాబడి ఇస్తాయని సాధారణ భావనలో పెట్టుబడిదారులు ఉంటారు, కానీ అన్ని ఈక్విటీ ఫండ్స్ సమానం కాదనే వాస్తవాన్ని గ్రహించాలి. రాబడి సామర్థ్యాలు వాటి ఈక్విటీ ఫండ్ రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని రంగాల వ్యాప్తంగా ఫండ్స్ డైవర్సిఫికేషన్ స్థాయిని మరియు ఏదైనా నిర్బంధిత రిస్క్ ఉన్న టాప్ హోల్డింగ్స్‌ను చూడండి. అతి తక్కువ రిస్క్ లేదా ఎక్కువ రాబడి కలిగిన ఫండ్స్ కోసం చూడటానికి బదులుగా, మీకు అంగీకారయోగ్యమైన రిస్క్ స్థాయిలుగల ఫండ్ కోసం మీరు చూడాలి.