లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్

మీ ప్రస్తుత పెట్టుబడిని పరిగణనలోకి తీసుకొని అవసరమైన మొత్తాన్ని లెక్కించడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యం కోసం ప్రణాళిక వేయండి.

సంవత్సరాలు
%
%
మొత్తం పెట్టుబడి ₹1.27 Lakh
తుది కార్పస్ ₹1.27 Lakh
మొత్తం కార్పస్ (ద్రవ్యోల్బణం-సర్దుబాటు) ₹1.27 Lakh

డిస్క్లైమర్:

గతంలో ప్రదర్శించిన పనితీరు భవిష్యత్తులో కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చు మరియు ఇది భవిష్య రాబడులకు హామీ కాదు.
దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.
మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.

%
₹1.27 Lakh
%
సంవత్సరాలు
పెట్టుబడి మొత్తం
పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం ₹1.27 Lakh

డిస్క్లైమర్:

గతంలో ప్రదర్శించిన పనితీరు భవిష్యత్తులో కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చు మరియు ఇది భవిష్య రాబడులకు హామీ కాదు.
దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.
మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.

లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి?

లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్‌ను, వన్-టైమ్ ఇన్వెస్ట్మెంట్‌ అని కూడా అంటారు, ఇది మీరు ఒకసారి పెట్టుబడి పెట్టే పెట్టుబడి రూపం, మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు పై నిర్ణీత కాలవ్యవధిలో కాంపౌండింగ్ రాబడిని సృష్టించడానికి అనుమతిస్తుంది.

లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ అనేది మీరు మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టిన లంప్‌సమ్ అంచనా మెచ్యూరిటీ విలువను లెక్కించడానికి మీరు ఉపయోగించగలిగే సాఫ్ట్‌వేర్ సాధనం.

సరళంగా చెప్పాలంటే, నిర్దిష్ట వడ్డీ రేటుతో ఈ రోజు మీరు పెట్టిన పెట్టుబడి యొక్క అంచనా భవిష్యత్తు విలువను మ్యూచువల్ ఫండ్ లంప్‌సమ్ కాలిక్యులేటర్ మీకు తెలియజేస్తుంది

ఉదాహరణకు మీరు రూ.2 లక్షలు పదేళ్ల పాటు 12% వడ్డీ రేటుతో పెట్టుబడి పెడితే, లంప్‌సమ్ రిటర్న్ కాలిక్యులేటర్ ప్రకారం, మీ పెట్టుబడుల భవిష్యత్తు కార్పస్ విలువ, రూ.6,21,169.64 అవుతుంది. అయితే ఇది కేవలం రాబడుల అంచనా మాత్రమే, వాస్తవ విలువ కాదు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్ ఒడిదుడుగులకు లోబడి ఉంటాయి.

MFSH లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

మ్యూచువల్ ఫండ్స్ సహి హై (MFSH) లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ అనేది ఎవరైనా ఉపయోగించగల సులభమైన ఆన్‌లైన్ సాధనం. లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్‌లో, మీరు ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి, అవి:

 

ఎ) ప్రారంభ పెట్టుబడి మొత్తం

బి) రేట్ ఆఫ్ రిటర్న్

సి) పెట్టుబడి సంవత్సరాలు (కాలపరిమితి)

 

ఈ వివరాలను సాధనంలో ఎంటర్ చేసిన తరువాత, ఈ లంప్‌సమ్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి అంచనా భవిష్యత్తు విలువను మీరు కనుగొనవచ్చు.

లంప్‌సమ్ మ్యూచువల్ ఫండ్ రాబడులను లెక్కించడానికి ఫార్ములా

పైన పేర్కొన్న విధంగా, మీ మ్యూచువల్ ఫండ్ లంప్‌సమ్ పెట్టుబడి రిడెంప్షన్ విలువ పెట్టుబడుల మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అయితే, మ్యూచువల్ ఫండ్ లంప్‌సమ్ కాలిక్యులేటర్ ఇదే ఫార్ములాను ఉపయోగించి పెట్టుబడుల నుండి వచ్చే రాబడులను అంచనా వేస్తుంది. ఉపయోగించిన ఫార్ములా:

A = P (1 + r/n) ^ nt

 

r - అంచనా రాబడులు

P - ప్రధాన కంట్రిబ్యూషన్ؚలు

T - మొత్తం వ్యవధి

n - కంట్రిబ్యూషన్ؚల సంఖ్య

 

ఒక ఉదాహరణతో లెక్కలు -

 

ప్రిన్సిపాల్: 50,000

రాబడి రేటు: 12%

వ్యవధి: 10 ఏళ్లు

 

A = P (1 + r/n) ^ nt

= రూ.1.55 లక్షలు (ఇది అంచనా రిడంప్షన్ విలువ.)

లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ మీకు ఎలా సహాయపడుతుంది?

ఈ క్రింది వాటికి లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది:

మొత్తం పెట్టుబడి కాలం నుండి అంచనా రాబడిని తెలియజేస్తుంది.

మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి మరియు వాటిని అంచనా వేయలేనప్పటికీ, ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ అవసరమైన గణనలను అందిస్తుంది (మాన్యువల్ లెక్కింపు లోపాలు లేకుండా.)

ఇది ఉపయోగించడానికి సులభమైనది మరియు కాలిక్యులేటర్‌లను సాపేక్షంగా సులభతరం చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ లంప్‌సమ్ కాలిక్యులేటర్ అంచనా రాబడి ఆధారంగా మీ ఫైనాన్స్‌లను మెరుగ్గా ప్రణాళిక వేసుకోవచ్చు.

ఈ లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?

మ్యూచువల్ ఫండ్‌లు సహీ హై పోర్టల్‌లో అందుబాటులో ఉన్న లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్, పైన పేర్కొన్న ఫార్ములాను అవసరమైన స్లాట్‌లలో అందించబడిన ముఖ్యమైన వేరియబుల్స్‌కు వర్తింపజేస్తుంది మరియు తక్షణమే మీకు అంచనా విలువను క్షణాలలో అందిస్తుంది.

వాస్తవ రాబడులు మారవచ్చని గమనించాలి. ఫీజులు, పన్నులు మరియు మార్కెట్ హెచ్చుతగ్గులు వంటి అంశాలు పెట్టుబడి వాస్తవ పనితీరును ప్రభావితం చేస్తాయి.

MFSH లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్కాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ కాలిక్యులేటర్ ఒక ఆర్థిక సాధనం, ఇది అనేక ప్రయోజనాలతో వస్తుంది, అవి:

 

1. పెట్టుబడి పెట్టె మొత్తాన్ని నిర్ణయించడంలో ఇది మీకు సహాయపడుతుంది: ఈ అంచనా ఆధారంగా తగిన మెచ్యూరిటీ విలువను పొందడానికి అవసరమైన గణనీయమైన మొత్తాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు.

2. పెట్టుబడి ప్రణాళిక సౌలభ్యం: మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడి ప్రణాళిక కోసం ఉపయోగించే సాధనాలలోఈ కాలిక్యులేటర్ కూడా ఒకటి.

తరచూగా అడిగే ప్రశ్నలు

Q1. లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు మంచి ఎంపిక?

ఇది పెట్టుబడిదారులు లంప్‌సమ్ؚగా లేదా SIP రూపంలో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అనే ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు లంప్‌సమ్ పెట్టుబడి మంచి పెట్టుబడి ఎంపిక కావచ్చు, పెట్టుబడిదారులు ప్రతి విరామంలో చెల్లించాలని గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు,

Q2. లంప్‌సమ్ కాలిక్యులేటర్ నాకు ఖచ్చితమైన ఫలితాలను అందించగలదా?

కాలిక్యులేటర్ మీకు ఖచ్చితమైన లెక్కలను అందిస్తుంది, కానీ ఇది పెట్టుబడి ఖచ్చితమైన ఫలితం కాదు -ఎందుకంటే మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి మరియు రాబడులను అంచనా వేయలేము.

Q3. మ్యూచువల్ ఫండ్స్ సహి హై లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్‌ కాలిక్యులేటర్ ఉపయోగించే ఫార్ములా ఏమిటి?

ఈ కాలిక్యులేటర్ ఉపయోగించే ఫార్ములా A = P (1 + r/n) ^ nt.

Q4. నేను లంప్‌సమ్ పెట్టుబడిని ఎప్పుడు ఎంచుకోవాలి?

మార్కెట్ తిరోగమనం సమయంలో లంప్‌సమ్ పెట్టుబడి పెట్టవచ్చు. ధరలు తక్కువగా ఉన్నప్పుడు, మీరు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు, ఇది దీర్ఘకాలికంగా మీకు మంచి రాబడిని అందించగలదు.