పొదుపు కన్నా పెట్టుబడి ఎందుకు మంచిది?

Video

50-ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లో #6వ బ్యాట్స్‌మన్ బ్యాట్ చేయడానికి 5 ఓవర్‌లో వచ్చాడని అనుకుందాము. ముందుగా అతను వికెట్ కోల్పోకుండా చూసుకోవాలి మరియు రన్స్ స్కోర్ చేయడం పైన దృష్టి ఉంచాలి.

ఇన్వెస్టింగ్ కొరకు సేవింగ్స్ తప్పనిసరి, కాగా తరువాత స్కోర్ చేయడానికి ఒకరి వికెట్‌ని కాపాడుకోవడం ముఖ్యము. డిఫెన్సివ్ క్రికెట్ ఆడటం మరియు అన్ని రకాల షార్టులు కొట్టడం మానేయడం ద్వారా అతను తన వికెట్ కాపాడుకోవచ్చు. కానీ దాని ఫలితంగా చాలా తక్కువ స్కోరు రావచ్చు. అతను నిర్దిష్ట రిస్కులు తీసుకుని కొన్ని బౌండరీలు లాఫ్టెడ్ షాట్లు లేదా ఫీల్డర్ల మధ్య డ్రైవ్‌లు లేదా కట్స్ లేదా నడ్జెస్ లాంటివి కొట్టాలి.

అలాగే, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి పెద్ద మొత్తంలో సమకూర్చడానికి వీలుగా, నిర్దిష్ట ఇన్వెస్ట్‌‌మెంట్ రిస్కులు తప్పక తీసుకోవాలి. ఇన్వెస్ట్‌‌ చేయడం అంటే అన్ని రిస్కులను తప్పించుకోకుండా, లెక్కించబడిన రిస్కులు తీసుకొవడం మరియు స్కీముని నిర్వహించడం.

అదే సమయంలో, క్రికెట్ అనాలజీలో, క్రీజులో ఉండటానికి, ఒకరు రిస్కులు లెక్కించాలి మరియు ర్యాష్ షాట్లు ఆడకూడదు. అనవసర రిస్కులు తీసుకోవడం చెడ్డ వ్యూహం.

కావున సేవింగ్స్ అవసరం కాగా, దీర్ఘకాల లక్ష్యాలను సాధించడానికి ఇన్వెస్టింగ్ చాలా ముఖ్యము.

407

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?