ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అనేవి ఈక్విటీల పెరుగుదల సామర్థ్యం ఉన్న టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఇవి ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షను 80C కింద మీరు పన్ను ఆదా చేసేందుకు సహాయపడుతూనే ఈక్విటీల పెరుగుదల సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ రెండు ప్రయోజనాలే కాకుండా, వీటికి మీరు టాక్స్ సేవింగ్ ఉత్పత్తుల కేటగిరీలలో పొందగల అతి తక్కువ 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్ కాబట్టి, ELSS కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీరు SIP లేదా ఏకమొత్తంలో ELSS లో పెట్టుబడి పెట్టవచ్చు. మీకు అనుకూలంగా ఉన్నట్లు మీరు ELSS లో SIP ద్వారా లేదా ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టవచ్చు. SIP సౌకర్యం నెలనెలా జీతం వచ్చేవారికి ప్రయోజనకరం ఎందుకంటే సంవత్సరం ముగింపులో ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టడం కంటే పన్ను ఆదా కోసం వారు ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని పక్కకు పెట్టడానికి ఇష్టపడవచ్చు. వారు ఉద్యోగంలో కొనసాగుతున్నందున సంవత్సరాల తరబడి వారు తమ SIP లతో కొనసాగవచ్చు.
3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి తప్పనిసరి అయినప్పటికీ, మీ డబ్బు మెచ్యూర్ అయిన లేదా లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత ఆటోమాటిక్‌గా వడ్డీ సంపాదించడం ఆపివేసే ఇతర టాక్స్ సేవింగ్ ఉత్పత్తుల లాగా కాకుండా, ఇందులో పెట్టుబడిదారుడు లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా తన పెట్టుబడిని కొనసాగించడానికి అవకాశం ఉంది. పెట్టుబడిదారు అతడు/ఆమె కోరుకున్నంత కాలం ఫండ్‌లో పెట్టుబడి ఉంచవచ్చు మరియు పెట్టుబడిదారు ఎంత ఎక్కువకాలం ఉంటే, అతని/ఆమె పెట్టుబడి రిస్క్ అంత తగ్గుతుంది, అప్పుడు సమయం గడిచేకొద్దీ అధిక రాబడి సంపాదనకు అవకాశాలు పెరుగుతాయి.
ELSS ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
402