టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అనేవి ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షను 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందించే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. కాబట్టి, ఈక్విటీ-ఆధారిత టాక్స్ సేవిగ్స్ ఇన్‌స్ట్రుమెంట్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఏ పన్ను చెల్లింపుదారునికి అయినా ELSS ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ELSS ఫండ్స్ అనేవి నెలనెలా జీతం వచ్చేవారికి మరింత అనుకూలం ఎందుకంటే వారికి క్రమమైన ఆదాయ వనరు ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం టాక్స్ సేవింగ్ పెట్టుబడులు పెట్టడం అవసరం. నిజానికి, వారు రూపాయి-ధర సరాసరి నుండి ప్రయోజనం పొందడానికి ELSS లో SIP ద్వారా నెలవారీ ప్రాతిపదికన హాయిగా పెట్టుబడి పెట్టవచ్చు.
ఒకవేళ మీరు యువ పన్ను చెల్లింపుదారు అయితే, ELSS లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రెండు ప్రయోజలను పొందవచ్చు, అంటే. సెక్షను 80C కింద పన్ను మినహాయింపు మరియు ప్రతి సంవత్సరం ELSS లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘ-కాలంలో ఈక్విటీల పెరుగుదల సామర్థ్యం పొందడం. పెద్దవయసు పన్ను చెల్లింపుదారులు కూడా పన్ను ప్రయోజనాలను పొందడానికి ELSS లో పెట్టగలిగినప్పటికీ, ELSS లో అంతర్గతంగా ఉన్న ఈక్విటీ రిస్క్‌కు పెద్ద పెట్టుబడి పరిధి. అవసరమవుతుంది, అది వారికి ఉండకపోవచ్చు.
గుర్తుంచుకోండి, ELSS ఫండ్స్‌కు