బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే ఏమిటి?

బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే ఏమిటి?

డైనమిక్ అసెట్ అలకేషన్ ఫండ్స్ అని కూడా పిలువబడే బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీకి చెందినవి. ఈ ఫండ్స్ ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ స్థిర కేటాయింపులకు పరిమితం కాకుండా ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. 

ఇతర హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ విధంగా కాకుండా, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ స్కీమ్ ఆఫర్ డాక్యుమెంట్‌లు మరియు SEBI (మ్యూచువల్ ఫండ్స్) రెగ్యులేషన్స్ 1996కు లోబడి మార్కెట్ హెచ్చుతగ్గులకు ప్రతిస్పందనగా తమ ఈక్విటీ మరియు డెట్ మిశ్రమాన్ని డైనమిక్‌గా మార్చగలవు.  

బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ముఖ్యమైన ఫీచర్‌లు:

> ఫ్లెక్సిబుల్ అసెట్ అలోకేషన్ ఫండ్స్: ఈ ఫండ్స్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా తమ స్టాక్-టు-బాండ్ నిష్పత్తిని చురుకుగా మారుస్తాయి మరియు దూకుడుగా నిర్వహించబడతాయి.        

పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను