మ్యూచువల్ ఫండ్స్‌ను ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ మరియు క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ గా వర్గీకరించబడ్డాయి. అయితే, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇప్పుడు చూద్దాం.
1) అవి ఏవి?
ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?
ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడులలో ఒక వర్గం. మదుపరులు ఏ సమయంలోనైనా యూనిట్‌లను కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. ఒకసారి కొత్త ఫండ్ ఆఫర్ ముగిసిన మీదట కొద్దిరోజులలోనే పెట్టుబడులు స్వీకరించడాన్ని ఫండ్ ఆరంభిస్తుంది. కావున మదుపరులు స్కీం సమాచార పత్రం ప్రకారం ఏ సమయంలోనైనా స్కీం యూనిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు.
క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) క్లోజ్-ఎండ్ ఫండ్లను ఫిక్స్డ్ మెచ్యూరిటీ తేదీ లేదా ఫిక్స్డ్ కాలపరిమితి కలిగిన మ్యూచువల్ ఫండ్లుగా నిర్వచిస్తుంది. స్కీం ఆరంభించిన సమయంలో నిర్దిష్ట కాలం బాటు మాత్రమే సబ్స్క్రిప్షన్ కొరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని పెట్టుబడి వ్యవధి చివరలోనే రిడీం చేసుకోగలరు.
2) అవి ఎలా పని చేస్తాయి?
ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మొదట్లో న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ద్వారా మార్కెట్లోకి వస్తాయి. సాధారణంగా, ఒక NFO గరిష్టంగా 15 రోజుల వరకు
మరింత చదవండి