పర్యావరణం గురించి మీరు ఎంతగానో జాగ్రత్త తీసుకునే వారు అనుకుందాం, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేసే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడం మీ విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు, కాబట్టి ఇప్పుడు మీకు, మీ నైతిక విలువలకు సరిపోయే పరిష్కారం మాత్రమే కాకుండా సంభావ్య రాబడులను సంపాదించి పెట్టే ఒక అవకాశాన్ని కూడా అందించే పరిష్కారం మీకు కావాలి.
నిర్వహణీయ పెట్టుబడుల ప్రపంచానికి స్వాగతం. నిర్దిష్టమైన పర్యావరణ సూత్రాలకు కట్టుబడి ఉండే కంపెనీలు మాత్రమే మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో చేర్చబడే లాగా నిర్ధారించుకునే ఒక ప్రత్యేకమైన ఫండ్ ఇది. సుస్థిరత, పరిరక్షణ మరియు హరిత భవిష్యత్తును ప్రాధాన్యతగా కొనసాగే వ్యాపారాలను జాగ్రత్తగా ఎంచుకుని వాటిలో ఈ ఫండ్లు పెట్టుబడి పెడతాయి. ప్రవేశపెడుతున్నాము, ESG ఫండ్స్, E–పర్యావరణం (ఎన్విరాన్మెంట్), S-సామాజికం (సోషల్), G-పాలన(గవర్నెన్స్)
స్వచ్ఛమైన ఎనర్జీ, వ్యర్థాల తగ్గింపు మరియు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతగా గల కంపెనీలకు ఒక వేదికను పర్యావరణ సంబంధిత విభాగం సిద్దం చేస్తుంది. న్యాయమైన కార్మిక విధానాలు, మానవహక్కులు మరియు కమ్యూనిటీ అభివృద్ధి ప్రాధాన్యతగా కొనసాగే వ్యాపారాల మీద సామాజిక విభాగం దృష్టి పెడుతుంది. పారదర్శక నాయకత్వం, నైతిక విలువలతో కూడిన నిర్ణయాలు మరియు బోర్డు వైవిధ్యతల సమ్మేళనాన్ని పాలక వ్యవస్థ నిర్ధారించుకుంటుంది.
పర్యావరణం, సామాజిక బాధ్యత
మరింత చదవండి