వర్గీకరణ మరియు తద్వారా వాటి మూలమైన పోర్ట్ఫోలియోల మీద ఆధారపడి మ్యూచువల్ ఫండ్స్ వివిధ రిస్క్లకు గురి కాగలిగి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేక రిస్క్లకు గురికాగలవు, అయితే అన్నింటి కంటే ఎక్కువగా ఉండేది మార్కెట్ రిస్క్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ’ఆధిక రిస్క్’ పెట్టుబడి ప్రోడక్ట్ల వర్గీకరణ కింద పరిగణిస్తారు. మార్కెట్ రిస్క్లకు అన్ని ఈక్విటీ ఫండ్స్ గురైనప్పటికీ, రిస్క్ స్థాయి లు ఫండ్కు ఫండ్కు మధ్య మారుతూ ఉంటాయి మరియు ఈక్విటీ ఫండ్ రకం మీద ఆధారపడి ఉంటాయి.
లార్జ్‌క్యాప్ కంపెనీ స్టాక్స్లో, అంటే బలమైన ఆర్థిక మూలాలు ఉన్న బాగా నిలదొక్కుకున్న కంపెనీలలో పెట్టుబడి పెట్టే లార్జ్ క్యాప్ ఫండ్స్ అతి తక్కువ రిస్క్తో కూడుకున్నవిగా భావించబడతాయి, ఎందుకంటే మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్ కంటే ఈ స్టాక్స్ సురక్షితమైనవని భావించడం జరుగుతుంది. తక్కువ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా చక్కటి -వైవిధ్య తను కలిగి ఉంటాయి, అంటే లార్జ్-క్యాప్ కేటగిరీలోని అన్ని రంగాల వ్యాప్తంగా విస్తరించి ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ మరియు ETFలు విస్తృత-ఆధారిత మార్కెట్ సూచీల మీద ఆధారపడి ఉంటాయి, ప్యాసివ్ వ్యూహాన్ని అనుసరించే అవి కూడా తక్కువ రిస్క్ కలవిగా భావించబడతాయి,
మరింత చదవండి