మీరు మ్యూచువల్ ఫండ్, వాటి పనితీరు, ఎన్ఏవిలు, ర్యాంకిగ్లను గురించి చూసేటప్పడు, RST బ్లూచిప్ ఫండ్ లేదా XYZ లార్జ్-క్యాప్ ఫండ్ అనే పేర్లు మీరు తరచూ తప్పక వినే ఉంటారు. ’బ్లూచిప్ ఫండ్ మరియు లార్జ్-క్యాప్ ఫండ్’ అనే ఫండ్ పేరు పరస్పరం ఉపయోగించబడతాయి, ఎందుకంటే ఆ రెండు పేర్లు స్టాక్ ఎక్ఛేంజ్‌లలో లిస్ట్ చేయబడిన లార్జ్-క్యాప్ కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను సూచిస్తాయి.
అక్టోబరు 2017 లో జారీచేసిన మరియు జూన్ 2018 నుండి అమలులో ఉన్న సెబీ యొక్క ఉత్పత్తి వర్గీకరణ సర్క్యులర్ మీరు చూస్తే, అందులో ఈక్విటీ ఫండ్ కేటగిరీ కింద బ్లూచిప్ ఫండ్స్ ప్రస్తావన లేదు. అంటే అర్థం మనకు ఇప్పుడు బ్లూచిప్ ఫండ్స్ లేవనా? కాదు, దీని అర్థం ఏమిటంటే పేరు ఏదైనప్పటికీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా జాబితా చేయబడిన టాప్ 100 కంపెనీలలో ఒక ఫండ్ పెట్టుబడి పెట్టినంత కాలం అది లార్జ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని వర్గీకరించబడుతుంది.
భారతదేశంలో వివిధ ఎక్ఛేంజ్‌లలో బహిరంగంగా లిస్ట్ చేయబడిన అనేక కంపెనీలు ఉన్నాయి. లార్జ్-క్యాప్ అనేది పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారతదేశంలో బహిరంగంగా జాబితా చేయబడిన ప్రథాన 100 కంపెనీలను సూచిస్తుంది (మార్కెట్ క్యాపిటలైజేషన్ = బహిరంగంగా జాబితా చేయబడిన షేర్ల సంఖ్య x ప్రతి షేర్ యొక్క ధర).
బ్లూచిప్ స్టాక్స్ తరచూ ఒక ఆర్థిక వ్యవస్థలో బహిరంగంగా జాబితా చేయబడిన అతిపెద్ద కంపెనీల స్టాక్స్‌ను సూచిస్తాయి. లార్జ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ అసెట్స్ లో 80% ను అలాంటి బ్లూచిప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. కాబట్టి కొన్ని AMCలు తమ లార్జ్-క్యాప్ ఫండ్స్‌కు బ్లూచిప్ మ్యూచువల్ ఫండ్స్ అని లేబుల్ ఇవ్వాలనుకుంటాయి.
మరోసారి మీరు ఒక స్థిరమైన రాబడి సామర్థ్యం ఉన్న బాగా వైవిధ్యీకరించబడిన ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, వాటి పేర్లను చూసి కంగారుపడకండి. అవి ఏ కేటగిరీ లోకి వస్తాయో, అవి లార్జ్ క్యాప్ ఫండ్స్‌గా వర్గీకరించబడ్డాయా అనేది చూడండి, ఒక ఫండ్‌ను నిర్ణయించుకోవడానికి ముందు మీ తదుపరి విశ్లేషణ మరియు ఎంపిక మొదలు పెట్టే దశను మీరు అక్కడి నుండే ప్రారంభించాలి.