ఒక హామీతో కూడిన ఆదాయ వనరును రిటైర్మెంట్ సమయంలో యాన్యువిటీ రూపంలో పెన్షన్ ప్లాన్ అందిస్తుంది. అయితే, అవి అత్యవసర సమయాలలో వెంటనే లిక్విడిటీని అందించవు, వైవిధ్యీకరణ, పెట్టుబడి స్టైళ్ళ విషయంలో పరిమిత ఛాయీస్‌ను అందిస్తాయి. పెన్షన్ ప్లాన్ దిశగా చెల్లించే ప్రీమియం మీద పన్ను మినహాయింపు ఉంటుంది.
ఇ.ఎల్.ఎస్.ఎస్.(ELSS) ఫండ్లో మీరు పెట్టుబడి చేస్తే తప్పించి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉండదు, కానీ మీ అవసరాల ప్రకారంగా ఒక రిటైర్మెంట్ ప్లాన్‌ను రూపొందించడంలో అవి మీకు మరింత వెరైటీని, ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి. మీరు గనక యువత ఐతే, మీ రిస్క్ ప్రాధాన్యతకు తగినట్లుగా ఈక్విటీ ఫండ్లలో మీరు సిప్‌లను ఆరంభించవచ్చు, మీ రిటైర్మెంట్ దగ్గర పడేంత వరకు సిప్‌లను కొనసాగించవచ్చు. అప్పటికి మీరు మీ రిస్కును తగ్గించుకునేందుకు రిటైర్మెంటుకు 2-3 సంవత్సరాల ముందు ఎస్‌టిపి (సిస్టమ్యాటిక్ ట్రాన్స్పర్ ప్లాన్) ద్వారా స్వల్ప-కాల డెబ్ట్ ఫండ్లకు వాటిని బదిలీ చేసుకోగల, మంచి మూలనిధిని నిర్మించుకోగలుగుతారు.
మీరు గనక మీ రిటైర్మెంటు కొరకు సిప్ ద్వారా ముందుగానే సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా ఉండి, రిటైర్మెంటుకు కొద్దిగా ముందర ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, మీరు పెద్ద మొత్తంలో చేసుకున్న ఆదాలను ఇప్పుడు మీరు పెట్టుబడి