రిస్కుని నిర్వహించడానికి మ్యూచువల్‌ ఫండ్స్ ఎలా సహాయపడతాయి?

రిస్కుని నిర్వహించడానికి  మ్యూచువల్‌ ఫండ్స్ ఎలా సహాయపడతాయి? zoom-icon

రిస్కులు అనేక రూపాలలో కనిపించవచ్చు. ఉదాహరణకి, ఒక కంపెనీలో మీకు షేర్ ఉంటే, ధర రిస్కు లేదా మార్కెట్ రిస్కు లేదా కంపెనీ నిర్దిష్ట రిస్కు ఉంటుంది. పై కారణాలలో వేటి వలనైనా లేదా ఈ రిస్కుల కలయిక ద్వారా కూడా ఆ ఒక్క కంపెనీ షేర్ మాత్రమే మునిగిపోవచ్చు లేదా కూలిపోవచ్చు కూడా.

అయితే, మ్యూచువల్‌ ఫండ్‌లో, ఒక టిపికల్ పోర్ట్‌ఫోలియో చాలా సెక్యూరిటీలను హోల్డ్ చేస్తుంది అలా “విస్తరణను” అందిస్తుంది. వాస్తవానికి, విస్తరణ మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడంలో అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి. ఒక దాని లేదా కొన్ని సెక్యురిటీస్ వెల తగ్గుదల వలన పోర్ట్‌ఫోలియో పనితీరును కూడా నిశ్చయపరుస్తుంది.

మనస్సులో ఉంచుకోవలసిన ఇంకొక ముఖ్యమైన రిస్క్, లిక్విడిటీ రిస్క్. లిక్విడిటీ అంటే ఏమిటి? ఇది అసెట్‌ని నగదుగా మార్చే సౌలభ్యత. ఇన్వెస్టర్‌ 10 సంవత్సరాల పాటు లాక్ చేసారని అనుకుందాము, అయితే ఆమెకు 3 సంవత్సరంలో డబ్బు అవసరము అయింది. ఇది ఒక టిపికల్ లిక్విడిటీ సమస్యని తెలుపుతుంది. ఈ క్షణంలో ఆమె ప్రాధాన్యత నగదు పొందడమే కానీ రిటర్నులు పొందాలని కాదు. మ్యూచువల్‌ ఫండ్స్ నియంత్రణ మరియు నిర్మాణం ద్వారా, అద్భుతమైన లిక్విడిటీని అందిస్తాయి. ఇన్వెస్టర్‌లకు, పెట్టుబడిలో సౌలభ్యత మరియు రిడెంషన్‌ని అందించడానికి పోర్ట్‌ఫోలియోలు రూపొందించబడినాయి.

402
481

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?