ప్రొటీనులు లేదా కార్బోహైడ్రేట్లు లేదా విటమిన్లను ఎవరు ఎక్కువగా తినాలని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ జవాబు ఏమిటి ?
ప్రతి ఒక్కరూ!
ప్రతి ఒక్కరూ అన్ని రకాల పోషకాలు తినాలి, కానీ వయస్సు మరియు శారీరక అవసరాలను బట్టి ప్రతి వ్యక్తికి పోషకాల భాగం వాటా మారుతుంది. ఉదాహరణకు, పెద్దల కన్నా పెరిగే పిల్లలకు మరిన్ని ప్రొటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు కావాలి. వారికి శక్తి ఎక్కువగా ఉన్న కార్బోహైడ్రేట్లు తగినంత సరఫరా కావాలి. ఇదే సూత్రం మీ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ట్‌ఫోలియోకు కూడా వర్తిస్తుంది.
ప్రతి వ్యక్తికి ఈక్విటీ, డెట్ ఫండ్స్, గోల్డ్ రియల్ ఎస్టేట్ మరియు అతని/ఆమె పోర్ట్ ఫోలియో ఇంకా ఇతర అసెట్లు మేళవింపు కావాలి. కానీ ప్రతి అసెట్ వాటా ప్రతి వ్యక్తిని బట్టి మారుతుంది. అలా, ప్రతి ఒక్కరికీ డెట్ ఫండ్స్ లాంటి స్థిర ఆదాయంఅసెట్లకు ఎక్స్పోజర్ కావాలి. సీనియర్ సిటిజెన్స్ వారి పోర్ట్‌ఫోలియోకి 30లలో ఉన్న యువత కన్నా డెట్ ఫండ్స్ మరిన్ని కేటాయించాలి. యువకులలో, ఎవరికైతే అధిక రిస్కు తీసుకోవడంలో అసౌకర్యవంతంగా ఉంటుందో అతను తన తోటి ఇన్వెస్టర్లకు ఎవరికైతే ఈక్విటీ ఇన్వెస్ట్ స్వభావంలో వోలటైల్ స్వభావంతో మరింత సౌకర్యవంతంగా ఉంటుందో వారి కన్నా డెట్ ఫండ్స్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. ఒక నియమంగా, మీ వయస్సుకు సమానంగా స్థిర ఆదాయం అసెట్లైన డెట్ ఫండ్స్‌కి మీ పోర్ట్‌ఫోలియోలో వాటాగా కేటాయించాలని సిఫార్సు చేయడమైనది. కొత్త మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా డెట్ ఫండ్స్‌తో ప్రారంభించవచ్చు.