ETFల పరిమితులు ఏమిటి?

Video

ETFలు నిష్క్రియా పెట్టుబడి ఉపకరణాలు, అవి అందులో ఉండే సూచీని ట్రాక్ చేసి, షేర్ల లాగే ఎక్స్ఛేంజీల మీద ట్రేడ్ చేస్తాయి. అయితే, ETFలను ఒక బ్రోకరు ద్వారా ఎక్స్ఛేంజీ నుండి కొనడం, అమ్మడం చేయవలసి ఉంటుంది. ETFలలో ట్రేడ్ చేయాలంటే మీకు డీమాట్ ఖతా ఉండడం అవసరం, ఇంకా ప్రతి లావాదేవీ మీద బ్రోకరుకు కమీషన్ చెల్లించవలసి ఉంటుంది. వాటి వాటి వాస్తవ సమయాల ట్రేడింగ్ మీద మూలధనాన్ని కూడబెట్టేందుకు ETFలలో పెట్టుబడి చేయాలని మీరు ఉవ్విళ్ళూరుతున్నట్లైతే, కాలక్రమేణా మీ రాబడులను కమీషన్ ఖర్చు తగ్గించవచ్చు. 

అదనంగా, మ్యూచువల్ ఫండ్లలో సిప్ ద్వారా అందుబాటులో ఉన్న రుపీ-కాస్ట్ సగటు ప్రయోజనాన్ని ETFలు అందించవు. ETFలలో క్రమవారీ పెట్టుబడులు చేయాలని మీరు అనుకుంటే, ప్రతి లావాదేవీ మీద కమీషన్ ఖర్చును కూడా మీరు భరించవలసి ఉంటుంది. తమ ఆర్ధిక లక్ష్యాలకు ఉత్తమంగా సరిపోయే ఒక ఆప్షన్‌ను పెట్టుబడిదారులు ఎంచుకోగలిగే గ్రోత్ మరియు డివిడెంట్ ఆప్షన్ వంటి ఫీచర్లను ETFలు అందించవు. ఉదాహరణకు, క్రమవారీగా డివిడెంట్ చెల్లింపును కోరుకునే వ్యక్తులు లేదా క్రమవారీ ఆదాయాన్ని కోరే ఒక రిటైర్ అయిన వ్యక్తి అవసరాన్ని ETFలు తీర్చలేవు.

కొన్ని ETFలు సముచితమైనవి లేదా సదరు రంగానికి నిర్దిష్టంగా ఉండి, తక్కువగా ట్రేడ్ చేస్తాయి. ETFలలో లావాదేవీలు జరిపేటప్పుడు విస్తార బిడ్‌ను/ఆస్క్ స్ప్రెడ్ (ETF యొక్క NAV  నుండి దాని ప్రస్తుత ధరలో వ్యత్యాసం)ను పెట్టుబడిదారులు ఎదుర్కోవచ్చు. స్వల్పకాలంలో ఊరించేవిగా ఉండగల ఇంట్రాడే ట్రేడింగ్ అవకాశాలను ETFలు అందిస్తూస్తుండగా, అవి దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యానికి నష్టదాయకం కావచ్చు. 

402