మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారులు ఏరకమైన రిస్కులకు గురి అవుతారు?

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారులు ఏరకమైన రిస్కులకు గురి అవుతారు?

స్టాక్స్, బాండ్లు, బంగారు లేక ఇతర ఆస్తుల తరగతులు ఏవైనప్పటికీ వివిధ మార్కెట్లలో వాణిజ్యం చేసే సెక్యూరిటీలలో మ్యూచువల్‌ ఫండ్స్ పెట్టుబడి పెడతాయి. వాణిజ్యం చేయదగిన ఏ సెక్యూరిటీ అయిన స్వాభావికంగా మార్కెట్ రిస్కు కలిగి ఉంటుంది, అంటే మార్కెట్ కదలిక కలిగించిన ఒడిదుడుకులకు సెక్యూరిటీ విలువ లోబడి ఉంటుంది.   

వడ్డీ రేటులో మార్పులు బాండ్ల ధర పడిపోయేలా ప్రభావితం చేస్తాయి, తద్వారా డెట్ ఫండ్ల NAVలు కూడా తగ్గేలా చేస్తాయి. ఆవిధంగా, డెట్ ఫండ్లు అత్యంత వడ్డీ రేటు రిస్కు ఎదుర్కొంటాయి. అవి క్రెడిట్ రిస్కుకు (బాండు జారీచేసినవారు డబ్బు చెల్లించకపోయే రిస్కు) కూడా గురి అవుతాయి.  కొన్ని ఆదాయ-సముపార్జన డెట్ ఫండ్లు ద్రవ్యోల్బణం రిస్కుకు కూడా గురి అవుతాయి, అంటే అవి అందించే రాబడి పెట్టుబడిదారు ఎదుర్కొనే ద్రవ్యోల్బణాన్ని పూరించలేక పోవచ్చు. 

ఈక్విటీ ఫండ్లు మార్కెట్లో స్టాక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడతాయి కాబట్టి, స్టాక్ ధరల హెచ్చుతగ్గులు ఈ ఫండ్ల NAV ని ప్రభావితం చేస్తాయి.

కొన్ని సెక్యూరిటీలు మార్కెట్లో చురుకుగా ట్రేడ్ అవుతుంటే, మరికొన్ని కావు. తరచూ ట్రేడ్ కాని సెక్యూరిటీలలో మ్యూచువల్ ఫండ్ మీ డబ్బును పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ సెక్యూరిటీని సరియైన సమయంలో సరియైన ధరకు కొనడం లేదా అమ్మడం చేయడంలో ఫండ్ ఇబ్బంది పడవచ్చు. ఇది ఫండ్ పోర్ట్‌పోలియో లోపల లావాదేవీల ఖర్చును పెంచే లిక్విడిటీ రిస్కు, ఇది మీ ఫండ్ NAV ని ప్రభావితం చేస్తుంది.

ఈవిధంగా, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడంలో ఉన్న రిస్కు అది ఏ రకమైన ఆస్తులలో పెట్టుబడి పెడుతుంది అనేదానిపై ఆధారిపడి ఉంటుంది.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?