మ్యూచువల్ ఫండ్ యొక్క డైరెక్ట్ ప్లాన్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలా?

మ్యూచువల్ ఫండ్ యొక్క డైరెక్ట్ ప్లాన్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలా?

మార్కెట్లో అందుబాటులో ఉన్న వేల కొలదీ మ్యూచువల్ ఫండ్ పథకాల నుండి, ఎవరైనా తమ పోర్ట్ఫోలియో కొరకు 4-5 అత్యంత యుక్తమైన ఫండ్లను ఎలా ఎంచుకుంటారు? మ్యూచువల్ ఫండ్స్ మీకు కొత్త అయితే, డైరెక్ట్ ప్లాన్ బదులుగా ఒక రెగ్యులర్ ప్లాన్‌లో ఒక అడ్వైజర్/డిస్ట్రిబ్యూటర్ సహాయంతో పెట్టుబడి చేయాల్సిందిగా సూచించడమైనది ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా పని చేస్తాయి, ఒక ఫండ్‌లో మీరు దేని కోసం చూడాలి, ఏ రకం ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి వంటి మొదలైన వాటిని మీరు అర్ధం చేసుకోవలసి ఉంటుంది. డిస్ట్రిబ్యూటరు కమీషన్‌ను ఒక రెగ్యులర్ ప్లాన్‌లో భరించడం అన్నది మీ పోర్ట్‌ఫోలియోలో మీ భవిష్య లక్ష్యాలను దారి తప్పించగల తప్పు ఫండ్‌ని కలిగి ఉండడం కన్నా మేలు.

ఫండ్‌ల రకాలు, పెట్టుబడి ఉద్దేశ్యం ప్రకారంగా ఫండ్‌లు  తమ పోర్ట్‌ఫోలియోను ఎలా నిర్మిస్తాయి, ఒక ఫండ్‌లో ఉండే రిస్క్ స్థాయి, ఒక ఫండ్ దేనికి అనువైనది, స్వల్ప కాలానికా లేదా దీర్ఘ కాలానికా, అది క్రమవారీ ఆదాయాన్ని ఇస్తుందా లేదా సంపదలు కూడబెడుతుందా, ఒక ఫండ్‌  ప్రదర్శనా సూచీలు ఏవి, చివరగా మీరు ఎందుకు పెట్టుబడి చేస్తున్నారు అనేది మీరు అర్ధం చేసుకుంటే మినహా, మీ లక్ష్యానికి సరైన ఫండ్‌లను ఎంచుకోవడంలో మీకు మార్గదర్శకం అవసరం. కొంతకాలం పాటూ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేస్తూ, ఈ ఉత్పత్తులను అర్ధం చేసుకున్న మదుపరుల కొరకు మాత్రమే ఒక డైరెక్ట్ ప్లాన్ బాగా పని చేస్తుంది. ఒక రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడి చేయడం ఆరంభించి, ప్రస్తుత పోర్ట్‌ఫోలియోతో కొంత అనుభవం సంపాదించిన తరువాత భవిష్య కొనుగోళ్ళ కొరకు డైరెక్ట్ ప్లాన్‌కు మారడం మంచి ఆలోచన.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?