సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? zoom-icon

సెక్టోరల్ ఫండ్స్ అనేవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇవి టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఎనర్జీ లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్ లేదా ఇతర రంగాలు వంటి ఒక నిర్దిష్ట పరిశ్రమలో నిర్వహించే వ్యాపారాలపై దృష్టి పెడతాయి. వారు కనీసం 80% నిధులను ఆ రంగానికి చెందిన స్టాక్స్ؚలో పెట్టుబడి పెడతారు, ఆ రంగం మంచి పనితీరును కనపరచినప్పుడు, సంభావ్య రాబడిని అందిస్తారు. ఏదేమైనా, ఈ పెట్టుబడి విధానం సెక్టార్ కేంద్రీకరణ కారణంగా అధిక రిస్క్ؚ కలిగి ఉంటుంది.


సెక్టోరల్ ఫండ్స్ లక్షణాలు

సెక్టోరల్ ఫండ్స్ నిర్దిష్ట రంగాలపై దృష్టి పెడతాయి, అంటే అవి ప్రధానంగా ఆ రంగాలలోని కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఎంచుకున్న రంగాలు మంచి పనితీరును కనపరిస్తే ఈ కేంద్రీకరణ అధిక రాబడులకు దారితీస్తుంది. అయితే, ఆ రంగాల పనితీరు ఆశించిన విధంగా లేకపోతే, అధిక రిస్క్ కూడా ఉంటుంది. ఫలితంగా, ఈ ఫండ్‌ల నుండి రాబడులు అనూహ్యంగా ఉంటాయి మరియు ఎంచుకున్న రంగాల పనితీరును బట్టి హెచ్చుతగ్గులకు లోనవుతాయి.

సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలు

  1. ఒక పరిశ్రమలోని వైవిధ్యీకరణ ఒక నిర్దిష్ట రంగంలోని వివిధ కంపెనీలు లేదా ఆస్తులలో పెట్టుబడులను విస్తరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  2. ఈ ఫండ్‌లు ఒక నిర్దిష్ట పరిశ్రమలో మెరుగైన పనితీరును కనబరిచే వ్యాపారాలపై దృష్టి పెట్టడం కారణంగా అధిక రాబడులకు అవకాశం ఉంది.
    ఒక నిర్దిష్ట పరిశ్రమ యొక్క అవకాశాలపై మీకు బలమైన నమ్మకం ఉంటే మరియు సాపేక్షంగా అధిక నష్టాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే, సెక్టోరల్ ఫండ్స్ పరిగణించదగినవి కావచ్చు.

 

డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

284

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?