లోడ్స్ అంటే ఏమిటి?

లోడ్స్ అంటే ఏమిటి?

సుదూర ప్రయాణంలో, కొన్నిసార్లు మీరు రోడ్డు లేదా బ్రిడ్డ్ ప్రవేశించినప్పుడు మరియు కొన్నిసార్లు నిష్క్రమించినప్పుడు టోల్ ఛార్జ్ చేయబడుతుంది. చాలా సందర్భాలలో, నిర్మాణ ఖర్చులు రివర్ అయ్యేందుకు టోల్ కంపెనీ నిర్దిష్ట సంఖ్యలోని సంవత్సరాలలో మాత్రమే ఛార్జ్ చేయడానికి అనుమతించబడుతుంది. ఆ కాలం అయిపోయిన తరువాత, ప్రయాణీకుల పైన ఎటువంటి ఛార్జ్ చేయడానికి కంపెనీ అనుమతించబడదు.

మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ కొన్ని లోడ్లకు లోబడి ఉంటుంది, కానీ మీరు ఇప్పుడే చదివిన ఉదాహరణల నుండి వేరుగా ఉంటాయి. 2009 వరకు, మ్యూచువల్‌ ఫండ్ ప్రవేశ సమయంలో మాత్రమే ఛార్జ్ విధించబడేది, కానీ అది ఇంకే మాత్రం లేదు. కొన్ని స్కీములు, స్కీము నుండి నిష్క్రమిస్తున్న సమయంలో నిర్దిష్ట నియమాల క్రింద, “ఎగ్జిట్ లోడ్” అనే ఛార్జీని విధిస్తాయి.

కొన్ని సందర్భాలలో, ఒక ఎగ్జిటే లేడ్ ఛార్జ్ చేసినప్పటికీ, ఒక నిర్దిష్ట కాలం లోపల ఎగ్జిట్‌కి ఇది వర్తిస్తుంది. ఈ కాలం కన్నా ఎక్కువ కాలం మీరు పెట్టుబడిలో ఉంటే, ఎటువంటి ఎగ్జిట్ లోడ్ వర్తించదు. ఇతర మాటలలో, చాలా తరచుగా, స్కీము నుండి త్వరగా నిష్క్రమించకుండా నిరుత్సాహపరిచే ఉద్దేశ్యంగా ఎగ్జిట్ లోడ్ పనిచేస్తుంది. “ఎగ్జిట్ లోడ్” పైన కూడా, సెబీ, మ్యూచువల్‌ నియంత్రణా అథారిటీ, ఛార్జ్ చేసే గరిష్ట ఎగ్జిట్ లోడ్ పైన పరిమితిని విధించింది.

405

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?