మ్యూచువల్ ఫండ్స్‌లో న్యూ ఫండ్ ఆఫర్ (NFO) అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్స్‌లో న్యూ ఫండ్ ఆఫర్ (NFO) అంటే ఏమిటి? zoom-icon

మ్యూచువల్ ఫండ్స్ ప్రపంచంలో, మీరు తరచుగా NFO అనే పదాన్ని చూడవచ్చు, ఇది న్యూ ఫండ్ ఆఫర్ؚను సూచిస్తుంది. దీనిని మార్కెట్‌లో కొత్త ఉత్పత్తిని లాంచ్ చేస్తున్న కంపెనీకి సమానమైనదిగా భావించవచ్చు. ఈ సందర్భంలో, "ఉత్పత్తి" అనేది మ్యూచువల్ ఫండ్ స్కీమ్ , మరియు NFO కొత్త స్కీమ్ యూనిట్ల ఆఫర్ؚను సూచిస్తుంది.   

“మ్యూచువల్ ఫండ్ؚలలో NFO అంటే ఏమిటి?” అనే ప్రశ్నకు సమాధానం సరళంగా చెప్పాలంటే, ఇది ఇప్పటికే ఉన్న లేదా కొత్త మ్యూచువల్ ఫండ్ ప్రారంభించిన సరికొత్త మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అని చెప్పవచ్చు. 

మీరు NFOలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు ప్రధానంగా మీ డబ్బును మ్యూచువల్ ఫండ్ؚలో పెడతారు మరియు ఫండ్ మేనేజర్ ఈ ఫండ్‌లను స్కీమ్ లక్ష్యాల ప్రకారం పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు.

NFO వ్యవధిలో, పెట్టుబడిదారులు ఈ కొత్త స్కీమ్ యూనిట్లను ఆఫర్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు, ఇది సాధారణంగా నిర్ణీత మొత్తానికి (ఉదా. యూనిట్‌కు రూ.10)గా సెట్ చేయబడుతుంది. పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును కలిసి పూల్ చేస్తారు. NFO వ్యవధి ముగిసిన తర్వాత, మ్యూచువల్ ఫండ్, ఈ పూల్ చేసిన డబ్బును పథకం లక్ష్యాల ఆధారంగా వివిధ ఆర్థిక సాధనాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తుంది. పెట్టుబడిదారులు ప్రారంభం నుంచి ఈ పథకంలో భాగస్వాములు కావడానికి వీలవుతుంది. 

ఏదేమైనా, NFOలో పెట్టుబడి పెట్టే ముందు మీ లక్ష్యాలు మరియు రిస్క్ ప్రొఫైల్ؚను అంచనా వేయడం చాలా అవసరం, ఇది స్కీమ్ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి.

సాధారణంగా 15 రోజుల NFO సబ్‌స్క్రిప్షన్ విండో వ్యవధిలో, పెట్టుబడిదారులు ఈ కొత్త స్కీమ్ యూనిట్లను ఫిక్స్డ్ ఆఫర్ ధరకు (ఉదా. యూనిట్ؚకు రూ.10) కొనుగోలు చేయగలరు. ఫండ్ మేనేజ్మెంట్ అందించే ఎంపికలను బట్టి, పెట్టుబడిదారులు ఏకమొత్తంలో పెట్టుబడి లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఎంచుకోవచ్చు. 

NFOలు పెట్టుబడిదారులను కొత్త పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశాన్ని ఇస్తుంది, కానీ జాగ్రత్తగా మూల్యాంకనం చేయడం కీలకం. 

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
 

285

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?