మీకు మల్టీ క్యాప్ మరియు ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏమిటి అని సరిగా తెలియకపోతే, మీరు అక్టోబరు 2017 లో జారీచేసిన మరియు జూన్ 2018 నుండి అమలులో ఉన్న సెబీ యొక్క ఉత్పత్తి వర్గీకరణ సర్క్యులర్ చూడవచ్చు. ఈ సర్క్యులర్ మల్టీ క్యాప్ ఫండ్స్ తమ అసెట్స్లో 65% లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్ల వ్యాప్తంగా ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. సెప్టెంబరు 2020 లో, మల్టీ క్యాప్ పెట్టుబడిదారులకు మంచి వైవిధ్యత అందించే లక్ష్యంతో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్లు ప్రతి దానిలో మల్టీ క్యాప్ ఫండ్స్ కనీసం 25% పెట్టుబడి ఉంచాలని సెబీ తప్పనిసరి చేసింది. అయితే, ఇది తమ తమ దృష్టికోణాన్ని బట్టి అవకాశాలను ఉపయోగించుకునే ఫండ్ మేనేజర్ యొక్క సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది, ఎందుకంటే కొన్నిసార్లు సరిగా పని చేయకపోవచ్చనే ఒక నిర్దిష్ట సెగ్మెంట్కు తక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండవచ్చు, అంటే అలా చేస్తే తప్పనిసరి అయిన 25% కనీస మొత్తాన్ని ఉల్లంఘించడం అని అర్థం.
కాబట్టి నవంబరు 2020 లో, సెబీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ప్రవేశపెట్టింది,
మరింత చదవండి