లార్జ్ క్యాప్ ఫండ్ తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా భారతదేశంలోని టాప్ 100 కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. మీరు ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీ డబ్బును ఫండ్ మేనేజర్లు చాలా పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రసిద్ధ కంపెనీలకు కేటాయిస్తారు. లార్జ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 80 శాతం పెట్టుబడులతో పెట్టుబడిదారులు బలమైన ఆర్థిక స్థితిగతులతో మార్కెట్ లీడింగ్, స్థిరమైన కంపెనీల్లో కొంత భాగాన్ని పరోక్షంగా సొంతం చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ కంపెనీల స్థిరత్వం మరియు బలంపై వృద్ధి చెందుతుంది. ఆర్థిక మాంద్యం నుంచి నావిగేట్ చేయడానికి కూడా ఈ కంపెనీలు బాగా సన్నద్ధమయ్యాయి. వారి దగ్గర బాగా స్థిరపడిన వ్యాపార నమూనాలు, దృఢమైన ఆర్థిక పునాదులు మరియు మార్కెట్ రిస్క్ؚలకు లోబడి దీర్ఘకాలంలో లాభాలను ఆర్జిస్తాయని నిరూపితమైన ట్రాక్ రికార్డులు ఉన్నాయి.
లార్జ్ క్యాప్ ఫండ్ؚలؚతో, పెట్టుబడిదారులు ప్రాథమికంగా బలమైన కంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి సరైన సమయాన్ని కనుగొనడం కోసం ఆందోళన చెందక్కర్లేదు. నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లు పెట్టుబడి ఎంపికలు చేస్తారు, ఇది మీకు సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది. కాబట్టి, లార్జ్-క్యాప్ ఫండ్ؚలో పెట్టుబడి పెట్టడం ఈ