ఆర్బిట్రేజ్ ఫండ్స్ అనేవి వివిధ క్యాపిటల్ మార్కెట్ లలో ఒకే అసెట్ కొరకు ఆర్బిట్రేజ్ అవకాశాలను వినియోగించుకునే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఆర్బిట్రేజ్ అనేది స్పాట్ మరియు ఫ్యూచర్స్ మార్కెట్లలో ఉండే ఒకే అసెట్ మీద ధరల వ్యత్యాసాల ప్రయోజనాన్ని పొందడాన్ని సూచిస్తుంది.
స్పాట్ మార్కెట్ లో విక్రయదారులు, కొనుగోలుదారులు కలిసి ఒకే అసెట్ కొరకు ఒక ధరను అంగీకరించి, ఆ క్షణంలో నగదు కోసం అసెట్ మార్పిడి చేస్తారు. ఇందుకు విరుద్ధంగా, ఫ్యూచర్స్ మార్కెట్లో, విక్రయదారులు, కొనుగోలుదారులు ఒక అసెట్ కొరకు రాబోయే భవిష్యత్తు తేదీన ఒక ధరను అంగీకరిస్తారు. దీనర్ధం, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన ఒక నిర్దిష్ట ధర వద్ద ఒక అసెట్ ను కొనుగోలు చేసేందుకు లేదా విక్రయించేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు.
స్పాట్ ధరలు ప్రస్తుత క్షణంలో ఉండే డిమాండ్, సప్లై ద్వారా నిర్ణయించబడతాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో, ఒక అసెట్ ధర భవిష్యత్తులో ఆశించిన సప్లై మరియు డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈక్విటీలు, డెట్, మనీ మార్కెట్ ఉపకరణాలలో ఆర్బిట్రేజ్ ఫండ్స్ ట్రేడ్ చేయగలవు. అయితే, ధరల వ్యత్యాసాల ప్రయోజనాన్ని పొందేందుకు ఒకేసారి రెండు వివిధ మార్కెట్లలో ఒకే అసెట్ పరిమాణాన్ని తప్పక కొనుగోలు చేయాలి మరియు విక్రయించాలి.
భారతదేశపు సెక్యూరిటీస్ మరియు ఎక్స్ఛేంజ్ బోర్డ్ మార్గదర్శకాలను బట్టి, ఆర్బిట్రేజ్ ఫండ్లు ఈక్విటీలలో కనీసం 65% ఫండ్లను తప్పక పెట్టుబడి చేయాలి. వాటికి కూడా ఈక్విటీ ఉపకరణాల మాదిరి పన్ను విధించబడుతుంది.
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి?
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఒకే పరిమాణంలో ఒక అసెట్‌ను వివిధ మార్కెట్లలో కొనుగోలు చేసి, విక్రయించి, ధరల తేడాల నుండి రాబడులను పొందుతాయి. మార్కెట్లు పూర్తిగా సమర్థవంతంగా ఉండవనే సూత్రంపై ఇవి పనిచేస్తాయి, తత్ఫలితంగా వివిధ మార్కెట్ లలో ధరల తేడాలను కలిగి ఉంటాయి.
దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం. X కంపెనీ షేర్ రూ.1,000 వద్ద క్యాష్ మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లు సాధారణంగా ప్రీమియంను కలిగి ఉంటాయి. కాబట్టి, అదే సెక్యూరిటీ ధర ఫ్యూచర్స్ మార్కెట్ లో రూ.1030 వద్ద ఉండవచ్చు.
X కంపెనీ యొక్క షేర్లను మీరు క్యాష్ మార్కెట్ లో రూ.1,000 వద్ద కొని, ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.1,030 వద్ద దానిని అమ్మవచ్చు. ఇప్పుడు ఇక్కడ మూడు వేర్వేరు దృశ్యవివరణలు ఉన్నాయి. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ముగింపు తేదీ నాటికి షేర్ ధర రూ.1,100 వరకు వెళ్తుంది. అప్పుడు మీరు క్యాష్ మార్కెట్ లో రూ.100ల లాభాన్ని పొందవచ్చు, ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.70ల నష్టాన్ని చూడవచ్చు. అప్పటికీ సగటున మీరు రూ.30ల లాభాన్ని పొందుతారు.
ఒకవేళ షేర్ ధర రూ.900లకు పడిపోతే, మీరు క్యాష్ మార్కెట్లో రూ.100లను పోగొట్టుకుంటారు, కానీ ఫ్యూచర్స్ మార్కెట్ లో రూ.130 లాభాన్ని పొందుతారు. ధర ఏ మాత్రమూ మారని పక్షంలో, ఫ్యూచర్స్ మార్కెట్లో మీరు అప్పటికీ రూ.30ల లాభాన్ని పొందుతారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ చేసేది కూడా అదే. లాభాన్ని ఆర్జించే సందర్భాన్ని అందించే వివిధ మార్కెట్ లలో ధరల వ్యత్యాసాల ప్రయోజనాన్ని అవి పొందుతాయి.
ఆర్బిట్రేజ్ ఫండ్ ప్రయోజనాలు
- ఆర్బిట్రేజ్ ఫండ్స్ వలన పరోక్షంగా ఎటువంటి రిస్కు ఉండదు. ఈ ఫండ్స్ యొక్క ఈక్విటీ బహిర్గతం పూర్తిగా పరిరక్షించబడుతుంది.
- ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు కౌంటర్పార్టీ రిస్క్ కూడా తీసివేయబడుతుంది, ఎందుకంటే సెటిల్మెంట్ హామీని ఎక్స్ఛేంజ్ అందిస్తుంది.
- మార్కెట్స్ ఒడిదుడుకులకు గురైనప్పుడు, క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్స్ లో భిన్న స్థాయిలను తీసుకోవడం ద్వారా గణనీయమైన లాభాలను ఆర్బిట్రేజ్ ఫండ్ అందించగలదు.
- హైబ్రిడ్ ఫండ్స్ అయినప్పటికీ, ఈక్విటీల మాదిరిగా వీటి మీద కూడా పన్ను విధింపు ఉంటుంది.
పెట్టుబడి చేసే ముందు పరిగణించవలసిన అంశాలు
1. రిస్క్
ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు ధర లేదా కౌంటర్పార్టీ రిస్క్ లేకుండగా, డెట్ ఉపకరణాలలో పెట్టుబడి చేసే ఫండ్స్ క్రెడిట్ రిస్క్‌కు లోబడి ఉండవచ్చు. పైగా, క్యాష్ ధరల కన్నా తగ్గింపు ధర వద్ద ఫ్యూచర్స్ ట్రేడ్ చేయబడవచ్చు కాబట్టి. బేరిష్ మార్కెట్స్‌లో ఆర్బిట్రేజ్ ఫండ్స్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవచ్చు.
2. రాబడి
ఆర్బిట్రేజ్ ఫండ్స్ సహేతుకమైన రాబడులను అందిస్తాయి. స్వల్ప కాల వ్యవధి నుండి మధ్యస్థ కాలవ్యవధిలో డబ్బు సంపాదించాలని మీరు అనుకుంటే, ఇవి సరైన ఉపకరణాలు. అయితే, మార్కెట్-అనుసంధానిత ఉపకరణాల మాదిరిగానే, లాభం వస్తుందన్న హామీ ఉండదు.
3. పెట్టుబడి హారిజన్
3 నుండి 6 నెలలు పెట్టుబడి పెట్ట గలిగిన మదుపుదారులకు ఆర్బిట్రేజ్ ఫండ్స్ చక్కగా సరిపోతాయి.
4. పెట్టుబడి మొత్తం
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల కన్నా ఒక పెద్ద మొత్తంలో ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం మంచిది.
5. స్కీం ఆఫర్ డాక్యుమెంట్:
ఒక ఆర్బిట్రేజ్ ఫండ్‌లో పెట్టుబడి చేయడానికి ముందు, స్కీం ఆఫర్ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదవడం ముఖ్యం. పెట్టుబడి ఉద్దేశ్యం, పెట్టుబడి వ్యూహం, రిస్కులు, అసెట్ కేటాయింపు, మరియు ఫండ్‌తో సహసంబంధ రుసుముల గురించి ముఖ్యమైన సమాచారం డాక్యుమెంట్లో ఉంది.
6. అసెట్ కేటాయింపు:
ముందుగా పేర్కొన్న విధంగా, ఈక్విటీ, డెట్ ఉపకరణాల మిశ్రమంలో ఆర్బిట్రేజ్ ఫండ్స్ పెట్టుబడి చేస్తాయి. ఫండ్ యొక్క అసెట్ కేటాయింపును, మీ పెట్టుబడి లక్ష్యాలు మరియు రిస్క్ ఆపేక్షతో అది ఎలా సమలేఖనం చేయబడుతుందో అర్ధం చేసుకోవడం ప్రథానం.
7. నిర్వహణా రుసుము:
అన్నీ మ్యూచువల్ ఫండ్స్ వలె, ఫండ్ నిర్వహణకు ఆర్బిట్రేజ్ ఫండ్స్ కూడా నిర్వహణా రుసుమును ఛార్జ్ చేస్తాయి. నిర్వహణ కింద అసెట్ లో కొంత శాతం ఈ రుసుముగా ఛార్జీ చేయబడుతుంది మరియు ఫండ్ ద్వారా ఏర్పడిన రాబడుల నుండి మినహాయించబడుతుంది. ఫండ్ ద్వారా ఛార్జ్ చేసే నిర్వహణా రుసుమును మరియు మీ రాబడులను అది ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది అర్ధం చేసుకోవడం ముఖ్యం.
సారాంశం
సంక్షిప్తంగా, స్వల్ప రిస్క్‌తో, ఒక మోస్తరు రాబడిని అందించే పెట్టుబడి కొరకు చూసే మదుపుదారుల కొరకు ఆర్బిట్రేజ్ ఫండ్‌లో పెట్టుబడి చేయడం అనేది ఒక సరైన వికల్పం కావచ్చు. అయితే, ఒక ఆర్బిట్రేజ్ ఫండ్‌లో పెట్టుబడి చేసే ముందు పెట్టుబడి ఉద్దేశ్యం, అసెట్ కేటాయింపు, నిర్వహణా రుసుములు, రిస్కులు, మరియు ట్రాక్ రికార్డును జాగ్రత్తగా పరిగణించడం ముఖ్యం. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మరింత స్పష్టత కొరకు మీ ఆర్ధిక సంబంధిత సలహాదారుడితో తప్పకుండా మాట్లాడండి.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.