ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ మరియు క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ మరియు క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? zoom-icon

మ్యూచువల్ ఫండ్స్‌ను ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ మరియు క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ గా వర్గీకరించబడ్డాయి. అయితే, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇప్పుడు చూద్దాం.

1)    అవి ఏవి?

ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?
ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడులలో ఒక వర్గం. మదుపరులు ఏ సమయంలోనైనా యూనిట్‌లను కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. ఒకసారి కొత్త ఫండ్ ఆఫర్ ముగిసిన మీదట కొద్దిరోజులలోనే పెట్టుబడులు స్వీకరించడాన్ని ఫండ్ ఆరంభిస్తుంది. కావున మదుపరులు స్కీం సమాచార పత్రం ప్రకారం ఏ సమయంలోనైనా స్కీం యూనిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. 


క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) క్లోజ్-ఎండ్ ఫండ్లను  ఫిక్స్డ్ మెచ్యూరిటీ తేదీ లేదా ఫిక్స్డ్ కాలపరిమితి కలిగిన మ్యూచువల్ ఫండ్లుగా నిర్వచిస్తుంది.  స్కీం ఆరంభించిన సమయంలో నిర్దిష్ట కాలం బాటు మాత్రమే సబ్స్క్రిప్షన్ కొరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని పెట్టుబడి వ్యవధి చివరలోనే రిడీం చేసుకోగలరు.


2)    అవి ఎలా పని చేస్తాయి?

ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ 

మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మొదట్లో న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ద్వారా మార్కెట్లోకి వస్తాయి. సాధారణంగా, ఒక NFO గరిష్టంగా 15 రోజుల వరకు ఓపెన్ ఉంటుంది. ఒకసారి NFO ఏర్పడిన మీదట , మీరు ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఆరంభించవచ్చు.

ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్‌లో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు నికర అసెట్ విలువ వద్ద యూనిట్‌లను మీరు తప్పనిసరిగా కొనుగోలు చేయగలరు లేదా అమ్మగలరు. NAV అనేది ఫండ్ ఎందులో అయితే పెట్టుబడి పెట్టిందో ఆ మొత్తం సెక్యూరిటీల మార్కెట్ విలువ. సెక్యూరిటీల మార్కెట్ విలువ ఆధారంగా NAV ప్రతి రోజూ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఫ్లోట్ చేయగలిగే యూనిట్ల సంఖ్యలో ఎటువంటి పరిమితి ఉండదు, అలాగే వీటికి మెచూరిటీ పీరియడ్ ఉండదు.

ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ను నిర్వహిస్తారు. వీరు ఫండ్ యొక్క ఉద్దేశ్యాలు మరియు ఆఫర్ పత్రాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలను తీసుకుంటారు. స్కీం సమాచార పత్రం ప్రకారంగా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్(SIPలు), ఏక మొత్తం లేదా సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్స్(STPలు) ద్వారా ఈ ఫండ్లలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.

క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్

న్యూ ఫండ్ ఆఫర్ (NFO) అనేది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(AMC) ల ద్వారా ప్రారంభించబడిన ఒక కొత్త స్కీం కొరకు తొలి సబ్‌స్క్రిప్షన్ ఆఫర్. క్లోజ్-ఎండెడ్ ఫండ్ؚలు కూడా దాదాపుగా ఓపెన్-ఎండెడ్ ఫండ్ؚల మాదిరిగానే ఉంటాయి. ఒకసారి NFO ప్రారంభించిన మీదట ఒక నిర్దిష్ట ధర వద్ద మ్యూచువల్ ఫండ్ యూనిట్లను మదుపరులు కొనుగోలు చేయవచ్చు. ఒకసారి NFO ముగిసిన మీదట మదుపరులు ఆయా ఫండ్‌లో పెట్టుబడి పెట్టలేరు. అయినప్పటికీ, మదుపరులు పెట్టుబడి పెట్టేందుకు AMC ఆ మ్యూచువల్ ఫండ్ను స్టాక్ ఎక్స్చేంజ్ؚలో లిస్ట్ చేస్తుంది. 

ఒక మదుపరునిగా, మెచ్యూరిటీ వరకు పెట్టుబడిని అలానే ఉంచేందుకు మీరు ఎంచుకోవచ్చు. ఫండ్ తిరిగి చెల్లించేటప్పుడు, మీకు NAV చెల్లించబడుతుంది.  ప్రత్యామ్నాయంగా మీకు అత్యవసర పరిస్థితుల్లో ఫండ్స్ అవసరమైతే, స్కీం సమాచార పత్రం ప్రకారంగా సెకండరీ మార్కెట్‌లో మీ యూనిట్లను మీరు అమ్ముకోవచ్చు. అవుట్ؚఫ్లోల భయం లేకుండా వాటిని కేటాయించే సౌలభ్యాన్ని ఫండ్ మేనేజర్లకు క్లోజ్-ఎండెడ్ ఫండ్స్ అందిస్తాయి.

3)    వాటి ప్రయోజనాలు ఏమిటి? 

ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ؚల ప్రయోజనాలు

ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని మీరు పరిగణిస్తున్నట్లయితే, మీరు తెలుసుకోవాల్సిన ప్రయోజనాలు దిగువ ఇవ్వబడ్డాయి:

1.  లిక్విడిటీ 
ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ؚల యూనిట్లను మీరు ఏ పని దినమైనా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు ఎందుకంటే వీటిని తేలికగా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. మీ పెట్టుబడులను ఎప్పుడు నగదు రూపంలోకి చేసుకోవాలి అనే దాని మీద ఎటువంటి నిబంధనలు లేవు. 

2.  పారదర్శకత 
ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క రికార్డులు అత్యంత పారదర్శకతను కలిగి ఉంటాయి. అవి ఏ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి, వాటి గత పెర్ఫార్మన్స్ చరిత్ర మరియు ఫండ్ మేనేజర్ యొక్క పనితీరు, ఇంకా మరెన్నో విషయాలను మీరు స్పష్టంగా చూడవచ్చు. పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఇది సులభతరం చేస్తుంది. అయినప్పటికీ గత పెర్ఫార్మన్స్, భవిష్య పెర్ఫార్మన్స్ కు ఎటువంటి హామీ ఇవ్వదు. మీ పెట్టుబడులను క్రమవారీగా సమీక్షించుకోవడం ప్రథానం..

3.  సిస్టమ్యాటిక్ వికల్పాలు  
ఏకమొత్తంలో, SIP, లేదా STP ద్వారా ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఆర్ధిక లక్ష్యాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు ఈ వికల్పాలు మీకు తోడ్పడతాయి. 

4. ప్రొఫెషనల్ నిర్వహణ  
ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ను ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. కాబట్టి తమ పోర్ట్ؚఫోలియోను చురుకుగా నిర్వహించుకోలేని వారికి ఇవి తగినవి. మార్కెట్ పరిస్థితిని పరిశోధించి, స్కీం ఆఫర్ పత్రం ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలను ఫండ్ మేనేజర్లు తీసుకుంటారు. అన్నివేళలా మార్కెట్ ను పర్యవేక్షించే కష్టం మీకు కలగకుండా చూసుకుంటారు. 

క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ వలన ప్రయోజనాలు

సులువైన లిక్విడిటీ, పారదర్శకత మరియు పెట్టుబడుల ఫ్లెక్సిబిలిటీ వంటి ప్రయోజనాలను ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ కలిగి ఉండగా, క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అవే ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

1. స్థిరత్వం
క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అత్యంత స్థిరమైనవిగా పరిగణించబడతాయి. NFO ఒకసారి ముగిసిన మీదట వాటిని లిక్విడేట్ చేయడం సాధ్యం కాదు తద్వారా ఒక స్థిరమైన అసెట్ బేస్‌ను ఫండ్ మేనేజరుకు అందించి, తగిన పెట్టుబడి వ్యూహాలను రూపొందించేందుకు వారికి తోడ్పడతాయి. లిక్విడిటీని నిర్వహించడం కూడా సులభమే ఎందుకంటే మెచ్యూరిటీ వరకు ఎటువంటి రిడీమ్షన్స్ ఉండవు, ఒకవేళ ఉన్నా కనీసంగా ఉంటాయి.

2. భారీ ఫ్లోల నుండి రక్షణ  
క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అందించే మరొక ప్రయోజనం ఏంటంటే లాకిన్ పిరియడ్‌లో ఎటువంటి కొనుగోళ్ళు, విక్రయాలు ఉండవు. కాబట్టి, ఫండ్ విలువలో ఎటువంటి గణనీయమైన డీవియేషన్స్ ఉండవు.  దీనిని సానుకూలంగా చూస్తే, కనిష్ట రిడీమ్షన్ ఒత్తిడి కారణంగా, తమ పెట్టుబడి వ్యూహాలకు ఫండ్ నిర్వాహకులు కట్టుబడి ఉండవచ్చు.

3. ప్రొఫెషనల్ؚగా నిర్వహించబడతాయి
క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ను కూడా ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. లాకిన్ పీరియడ్ ఉండడంతో, లిక్విడిటీ నిర్వహణతో బిజీగా ఉండడానికి బదులుగా ఫండ్ పెర్ఫార్మెన్స్ మెరుగుపరచే పెట్టుబడి వ్యూహాలను ఫండ్ మేనేజర్లు రచిస్తారు. శీర్షిక మరియు వివరణ మధ్య తేడా

ఓపెన్-ఎండెడ్ మరియు క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ؚలలో వేటిని ఎంచుకోవాలి? 

ఓపెన్-ఎండెడ్ మరియు క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ؚలలో ఒకదాన్ని ఎంపిక చేసేటప్పుడు. అనేక కారకాలను మీరు పరిగణించవలసి ఉంటుంది: 

1. లిక్విడిటీ
ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ మరింత లిక్విడిటీని కలిగి ఉంటాయి. ఎందుకంటే, మీరు కావాలనుకున్నప్పుడు యూనిట్లను మీరు కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ను మీరు ఎక్స్ఛేంజీలో అమ్మవచ్చు, అయితే ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంత లిక్విడిటీ ఉండకపోవచ్చు. 

2.  రుసుము 
ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ధర అధికంగా ఉండవచ్చు, అధిక రుసుము కలిగి ఉండవచ్చు. క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా తక్కువ రుసుము కలిగి ఉంటాయి. ఇది కనక మీకు ఒక కారకం అయితే, పెట్టుబడి పెట్టే ముందు ఆయా రుసుములు చెక్ చేసుకోవడం తప్పనిసరి. 

3. పెట్టుబడి వ్యవధి 
ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ కొరకు పెట్టుబడి వ్యవధి పూర్తిగా మదుపరుల ప్రాథాన్యత మరియు ఆర్ధిక లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ నిర్దిష్ట లక్ష్యాలు కలిగి, స్వల్ప కాల వ్యవధులలో అమ్ముకోగల మదుపరులకు అనుకూలమైనవి కావచ్చు.

4. ఫ్లెక్సిబిలిటీ  
ఏక మొత్తంలో గానీ, SIP ద్వారా గానీ ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ కు పరిమిత పెట్టుబడి విండో ఉంటుంది కాబట్టి, SIPల ద్వారా మీరు వాటిలో పెట్టుబడి పెట్టలేరు. కేవలం ఏకమొత్తంలో పెట్టుబడులు మాత్రమే అనుమతించబడతాయి. 

కాబట్టి, పెట్టుబడిలో మరింత ఫ్లెక్సిబిలిటీని, అత్యధిక లిక్విడిటీని మీరు కోరుకుంటే, ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ మీకు మెరుగైన వికల్పం కావచ్చు. ఎప్పటి లాగానే, ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో మీరు పెట్టుబడి పెట్టే ముందు, మీరు మీ వంతు పరిశోధన చేసి, మీ పెట్టుబడి ఉద్దేశ్యాలను మరియు రిస్కు ప్రొఫైల్ ను అర్ధం చేసుకున్నారని నిర్ధారించుకోండి. స్కీం యొక్క రిస్క్-ఓ-మీటర్ చెక్ చేసుకోండి, మార్కెట్ లోని ఇతర స్కీంలతో పోలిస్తే, ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఎంత రిస్కుతో కూడుకున్నదో అన్నది అది తెలియజేస్తుంది. బెంచ్ మార్క్ రిస్క్-ఓ-మీటర్ చెక్ చేసి, మీరు పరిగణిస్తున్న పెట్టుబడితో దానిని పోల్చడం కూడా ఎంతగానో సహాయపడుతుంది. మరింత అవగాహనా పూర్వక నిర్ణయాన్ని తీసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. 

ఓపెన్-ఎండెడ్ లేదా క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో దేనిలో మీరు పెట్టుబడి చేస్తారు అన్నదానితో సంబంధం లేకుండా స్కీం సంబంధిత ఆఫర్ పత్రాలను అన్నింటినీ మీరు చదివారని నిర్ధారించుకోండి. ఏవైనా వివరాలు కావాలంటే మీ ఆర్థిక సలహాదారును సంప్రదించండి.  

డిస్క్లైమర్

AMFI వెబ్‌సైట్‌లో మ్యూచువల్ ఫండ్‌ల వివిధ వర్గాల గురించి ప్రచురించిన సమాచారం, ఒక ఆర్ధిక సంబంధిత ఉత్పాదక వర్గంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన ఏర్పరచేందుకు సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే కానీ విక్రయాల ప్రమోషన్ లేదా వ్యాపార అభ్యర్ధనల కోసం మాత్రం కాదు. 

బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గత మూలాలు, ఇతర విశ్వసనీయమైన తృతీయ వర్గపు మూలాల ఆధారంగా ఈ సమాచారం AMFI ద్వారా తయారుచేయబడింది. అయినప్పటికీ, అటువంటి సమాచార ఖచ్చితత్వానికి, దాని సంపూర్ణతకు AMFI ఎటువంటి హామీ ఇవ్వదు, లేదా అటువంటి సమాచారం మార్చబడదని వారంట్ ఇవ్వదు. 

ఇక్కడి సమాచారం, ప్రతి ఒక్క మదుపుదారుని ఉద్దేశ్యాలు, రిస్కు కాంక్షలు, లేదా ఆర్ధిక సంబంధిత అవసరాలు లేదా పరిస్థితులు లేదా ఇక్కడ విశదపరచిన మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తుల పొందికలను పరిగణనలోకి తీసుకోదు. తద్వారా, దీనికి సంబంధించి పెట్టుబడి సలహా కొరకు తమ తమ ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/కన్సల్టెంట్/ట్యాక్స్ అడ్వైజర్ లను మదుపరులు సంప్రదించవలసిందిగా సూచించడమైనది. 

ఒక మ్యూచువల్ ఫండ్ స్కీం అనేది ఒక డిపాజిట్ ఉత్పత్తి కాదు, మరియు అది మ్యూచువల్ ఫండ్ లేదా దాని ఎఎంసికి లోబడి ఉండదు, లేదా వారి చేత హామీగానీ, రక్షణను గానీ అందించబడదు. సంబంధిత పెట్టుబడుల స్వభావం కారణంగా, ఒక మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తి రాబడులు లేదా సంభావ్య రాబడులు హామీ ఇవ్వబడవు. చూపించిన చారిత్రక పనితీరు సంపూర్ణంగా రెఫరెన్స్ ప్రయోజనాల కొరకు మాత్రమే గానీ భవిష్య ఫలితాలకు హామీ కాదు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
 

285