మీరు ఫిర్యాదు చేసినప్పుడు, ఈ సమస్యకు సంబంధించి మీరు ఇప్పటికే కంపెనీని సంప్రదించడానికి ప్రయత్నించారా అని SEBI తనిఖీ చేస్తుంది. ఒకవేళ మీరు "లేదు" అని సమాధానం ఇచ్చినట్లయితే, మీ ఫిర్యాదు మొదట కంపెనీకి పంపబడుతుంది, దీనికి ప్రతిస్పందించడానికి 21 క్యాలెండర్ రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ మీరు "అవును" అని సమాధానం ఇస్తే, మీ ఫిర్యాదు నేరుగా SEBIకి వెళుతుంది.
SCORESతో ఫిర్యాదు చేయడానికి సాధారణంగా అవసరమైన డాక్యుమెంట్లు:
> ఒప్పందాల కాపీలు
> దరఖాస్తు ఫారాలు
> బ్యాంక్ స్టేట్మెంట్లు
> ఒప్పంద గమనికలు
> ఇమెయిల్‌లు, ఫ్యాక్స్‌లు మరియు ఇతర ఉత్తరప్రత్యుత్తరాలు
SEBI SCORES పోర్టల్ ఉపయోగించి ఫిర్యాదు ఎలా చేయాలనే దానిపై ఒక సాధారణ గైడ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం:
స్టెప్ 1: SEBI వెబ్ؚసైట్ؚకు లేదా నేరుగా SCORESకు వెళ్లండి. మీరు కొత్తవారు అయితే, మీ పుట్టిన తేదీ మరియు PAN అందించడం ద్వారా నమోదు చేసుకోండి. మీ వివరాలు స్వయంచాలకంగా లభిస్తాయి.
స్టెప్ 2: రిజిస్టర్ అయిన తర్వాత మీ యూజర్ IDతో లాగిన్ అవ్వండి.
స్టెప్ 3: లాగిన్ అయిన తరువాత, "ఫిర్యాదును నమోదు చేయండి" విభాగాన్ని కనుగొనండి. లిస్టెడ్ కంపెనీ, స్టాక్ బ్రోకర్ లేదా మ్యూచువల్ ఫండ్ వంటి మీరు ఫిర్యాదు చేస్తున్న సంస్థను ఎంచుకోండి.
స్టెప్ 4: తగిన కేటగిరీని ఎంచుకోండి మరియు ఖచ్చితమైన సమాచారంతో ఫారాన్ని నింపండి. లావాదేవీ రికార్డులు లేదా కమ్యూనికేషన్ ఎక్స్ؚఛేంజ్ వంటి సంబంధిత పత్రాలను జతచేయండి.
స్టెప్ 5: ఖచ్చితత్వం కోసం మీ ఫిర్యాదును సమీక్షించండి.
స్టెప్ 6: మీ ఫిర్యాదును సబ్మిట్ చేయండి మరియు ట్రాకింగ్ కోసం ప్రత్యేక ఫిర్యాదు రిజిస్ట్రేషన్ నంబర్ؚను అందుకోండి.
స్టెప్ 7: పోర్టల్ ద్వారా రియల్ టైమ్ؚలో మీ ఫిర్యాదును ట్రాక్ చేయండి. SEBI ప్రక్రియ యొక్క వివిధ దశలలో నవీకరణలను అందిస్తుంది.
స్టెప్ 8: ఒకవేళ SEBI మరింత సమాచారాన్ని కోరితే, వెంటనే స్పందించి దర్యాప్తునకు సహకరించాలి.
స్టెప్ 9: SEBI తన దర్యాప్తును పూర్తి చేసిన తర్వాత, తీసుకున్న చర్యలతో సహా పరిష్కారం గురించి మీకు కమ్యూనికేట్ చేస్తుంది.
ఈ దశలను అనుసరించడం ద్వారా, పెట్టుబడిదారులు ఫిర్యాదులను దాఖలు చేయడానికి మరియు భారత ఆర్థిక మార్కెట్లలో పారదర్శకత మరియు నిష్పాక్షికతను కాపాడటానికి సహాయపడటానికి SEBI SCORES పోర్టల్ؚను ఉపయోగించచ్చు.
SEBI ODR (ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్) అనేది ఫిర్యాదులకు మరోక ప్లాట్ؚఫామ్, సెక్యూరిటీల లావాదేవీలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ఇన్వెస్టర్లకు ఆన్లైన్ యంత్రాంగాన్ని అందించడానికి SEBI చేపట్టిన కార్యక్రమం.
ఇన్వెస్టర్లు అధికారిక SEBI పోర్టల్ ద్వారా ఈ ప్లాట్ؚఫామ్ؚను యాక్సెస్ చేసుకోవచ్చు. సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వివాదాలను నమోదు చేయడానికి వినియోగదారులు ప్లాట్ؚఫామ్ؚలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ؚఫామ్ؚ ఆన్లైన్ ఫైలింగ్, ట్రాకింగ్ మరియు ఫిర్యాదులను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది.
SEBI ODR వివాదంలో పాల్గొన్న పక్షాల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ؚను అనుమతిస్తుంది మరియు సెటిల్మెంట్ చర్చలను సులభతరం చేస్తుంది. ఇన్వెస్టర్లు తమ ఫిర్యాదుల స్థితిని పర్యవేక్షించవచ్చు మరియు SCORES ప్లాట్ؚఫామ్ మాదిరిగానే SEBI ODR ద్వారా అప్డేట్లనుపొందవచ్చు.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.