డైనమిక్ బాండ్ ఫండ్స్, అనేవి పెట్టుబడి వ్యవధిని నిర్వహించడంలో ఉండే సౌలభ్యానికి ప్రసిద్ధి చెందిన డెట్ ఫండ్ల వర్గానికి చెందిన ఫండ్స్. ఆర్థిక వ్యవస్థలో వచ్చే వడ్డీరేట్ల మార్పులను, రాబడులు పెంచుకునే అవకాశాలుగా మలుచుకోవడం వీటి ప్రధాన లక్ష్యం. ఫండ్ మేనేజర్లు ప్రస్తుత వడ్డీ రేటు ట్రెండ్లకు ప్రతిస్పందిస్తూ, ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని బాండ్ల వ్యవధిని తెలివిగా సర్దుబాటు చేయడం ద్వారా దీనిని సాధిస్తారు. మార్కెట్ డైనమిక్స్ మరియు వడ్డీ రేటు మార్పులకు ప్రతిస్పందనగా వివిధ రకాల బాండ్లు, మెచ్యూరిటీలు మరియు క్రెడిట్ విభాగాలకు బదిలీ చేసే సామర్థ్యాన్ని డైనమిక్ బాండ్ ఫండ్ కలిగి ఉంటుంది.
అంతేకాకుండా, వడ్డీ రేట్లపై ఫండ్ మేనేజర్‌కు ఉన్న దృక్కోణం ఆధారంగా డైనమిక్ బాండ్ ఫండ్ల పోర్ట్‌ఫోలియో వ్యవధిని మార్చవచ్చు. ఈ సర్దుబాట్లు పొడిగించిన వ్యవధిగల ప్రొఫైల్‌లకు దారితీస్తాయి, ఫలితంగా స్వల్పకాలిక పనితీరులో వైవిధ్యం ఏర్పడుతుంది. ఏదేమైనా, దీర్ఘకాలికంగా, ఈ ఫండ్స్ విభిన్న వడ్డీ రేటు సైకిల్స్‌తో కలిసిపోయి, సాపేక్షంగా అధిక రాబడిని అందిస్తాయి. మీరు డైనమిక్ బాండ్ల గురుంచి వాటి ప్రాథమిక లక్షణాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
రిస్క్: డైనమిక్ బాండ్స్ సాధారణంగా మోడరేట్ రిస్క్ కిందకు వస్తాయి.
వడ్డీ రేట్లు: బాండ్ల ధరలు వడ్డీ రేట్లకు విలోమంగా మారతాయి; పెరిగే రేట్లు తరచుగా బాండ్ల ధరల పతనానికి దారితీస్తాయి.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.